Sri Adi Shankarabhagavatpadaacharya virachita
Sivananda Lahari
Sloka -1
కలాభ్యాం చూడాలంకృతశశికలాభ్యాం నిజతపః
ఫలాభ్యాం భక్తేషుప్రకటితఫలాభ్యాం భవతు మే |
శివాభ్యామస్తోక త్రిభువనశివాభ్యాం హృది పునః
ర్భ్వవాభ్యామానందస్ఫురదనుభవాభ్యాం నతిరియమ్ ||
कलाभ्यां चूदालन्कृतशशिकलाभ्यां
निजतपः
फलाभ्यां
भक्तेषुप्रकटितफलाभ्यां भवतु मे |
शिवाभ्यां
त्रिभुवनशिवाभ्यां हृदि पुनः
र्भवाभ्यामानन्दस्फुरदनुभ्वाभ्यां
नतिरियम् ||
My prostrations again and
again in my heart be rendered to,
The eternal duo whose
personification is art,
Whose locks of matted-hair
hold a portion of the crescent of the moon,
Whose penance on each
other not only complements their power but is also pronounced in granting the
wishes of the devotees,
Who are always the most
auspicious and the bringers of the eternal bliss to the three worlds (The
earth, the Heavens and the Netherworld?)
Who are experienced by the
saints and devotees in their highest mode of salvation as the ultimate bliss.
Sloka -2
గళంతీ శంభోత్వచ్చరిత సరితః కిల్బిషరజో
దళంతీ ధీకుల్యా సరణిషు పతంతీ విజయతామ్ |
దిశంతీ సంతసారభ్రమణ పరితాపోపశమనం
వసంతీ మచ్చేతో హ్రదభువి శివానందలహరీ ||
దళంతీ ధీకుల్యా సరణిషు పతంతీ విజయతామ్ |
దిశంతీ సంతసారభ్రమణ పరితాపోపశమనం
వసంతీ మచ్చేతో హ్రదభువి శివానందలహరీ ||
गळन्ती शम्भोत्वच्चरित सरितः किल्बिषरजो
दळन्ती धीकुल्या सरनिषु पतन्ती विजयताम् |
दिशन्ती संतसारब्रमण परितापोपशमनं
वसन्ती मच्चेतो ह्रदभुवि शिवानन्दलहरी ||
दळन्ती धीकुल्या सरनिषु पतन्ती विजयताम् |
दिशन्ती संतसारब्रमण परितापोपशमनं
वसन्ती मच्चेतो ह्रदभुवि शिवानन्दलहरी ||
My
Lord, Shambho!, the holy trickling water of your deeds documented in the
history tramples the dust of our sins and meanders successfully into the
streams of our wisdom, by which they show us the way of respite to the pain
from the eternal wheel of causation of life and death. They stay there in my
heart as the blissful waves of you named “Śivānandalaharī”
Sloka -3
త్రయీవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం
జటాభారోదారం చలదురగహారం మృగధరమ్ |
మహాదేవం దేవం మయి సదయభావం పశుపతిం
చిదాలంబం సాంబం శివమతివిడంబం హృది భజే ||
त्रयीवेद्यं हृदयं त्रिपुरहरमाद्यं त्रिनयनं
जटाभारोदारं चलदुरगहारं मृगदरम् |
महादेवं देवं मयि सदयभावं पशुपतिं
चिदालंबं साम्बं शिवमतिविदंबं हृदि भजे ||
I
pray to the God of all the gods Samba in my heart who is knowledgeable of all
that exists in trinity (The three Vedas, Kalas, Purushas and all those that are
in three number), who is dear to the heart, the one who has been existent since
time immemorial and the first to have been existed, the one who has destroyed
the three cities of Rakshasas, whose
matt-locked hair is so thick and distinguished, whose neck is adorned by a
garland of a moving snake and the body with that of the skin of a deer, the one
who is ever compassionate to me as with all the living beings, the one who is
the preserver of all the knowledge and always auspicious and whose dance is so
gracefully enacted.
Sloka -4
సహస్రం వర్తంతే జగతి
విబుధాః క్షుద్రఫలదాః
న మన్యే స్వప్నే వా తదనుసరణం తత్కృతఫలమ్ |
హరిబ్రహ్మాదీనామాపి నికటభాజామసులభం
చిరం యాచే శంభో శివ తవ పదాంభోజభజనమ్ ||
सहस्रं वर्तन्ते जगति विबुधाः क्षुद्रफलदाः
न मन्ये स्वप्ने वा तदनुसरणं तत्कृतफलम् |
हरिब्रह्मादीनामपि निकटभाजामसुलभं
चिरं याचे शम्भो शिव तव पदाम्भोजभजनम् ||
My lord Shambho, Siva, you
are the auspicious one. There are thousands of other Gods who give the desired
results. But not even in my dreams will I think of them or the results that
they are to offer. Fully knowing that it is hard to be obtained by those close
to you like Lord Vishnu and Lord Brahma, I beg for your servitude for long
always.
Sloka -5
స్మృతౌ శాస్త్రే వైద్యే శకునకవితాగానఫణితౌ
పురాణే మంత్రే వా స్తుతినటనహాస్యేష్వచతురః |
కథం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి కోహం పశుపతే
పశుం మాం సర్వజ్ఞ ప్రథిత-కృపయా పాలయ విభో ||
स्म्रुतौ शास्त्रे वैद्ये शकुनकवितागानफनितौ
पुराणे मन्त्रे वा स्तुतिनटनहास्येष्वचतुरः |
कथं राज्ञां प्रीतिर्भवति मयि कोऽहं पशुपते
पशुं मां सर्वज्ञ प्रथित-कृपया पालय विभो ||
My lord Shambho, Siva, you
are the auspicious one. There are thousands of other Gods who give the desired
results. But not even in my dreams will I think of them or the results that
they are to offer. Fully knowing that it is hard to be obtained by those close
to you like Lord Vishnu and Lord Brahma, I beg for your servitude for long
always.
Sloka -6
ఘటో వా మృత్పిండోప్యణురిపు చ ధూమోగ్నిరచలః
పటో వా తంతుర్వా పరిహరతి కిం ఘోరశమనమ్ |
వృధా కంఠక్షోభం వహసి తరసా తర్కవచసా
పదాంభోజం శంభోర్భజ పరమసౌఖ్యం వ్రజ సుధీః ||
घटो वा मृत्पिन्दोप्यणुरिपु च धूमोग्निरचलः
पटो वा तन्तुर्वा परिहरति किं घोरशमनम् |
वृधा कंठक्षोभं वहसि तरसा तर्कवचसा
पदाम्भोजं शंभोर्भज परमसोउख्यं व्रज सुधीः
O, the one who calls yourself
a scholar? Can death be thwarted by the logic like - whether it’s an earthen
pot or a mound of earth or a miniscule particle of mud, - or – if it is a smoke
or a fire on the mountain, / is it a cloth or a thread? By these vain
altercations, all you achieve is mere a sore throat. Instead, worship Lord
Shambhu’s lotus feet that can shower on you the ultimate bliss by saving you
from the circle of life and death)
Sloka -7
మనస్తే పాదాభ్జే నివసతు వచః స్తోత్రఫణితౌ
కరౌ చాభ్యర్చాయాం శృతిరపి కథాకర్ణనవిధౌ |
తవ ధ్యానే బుద్ధిర్నయనయుగళం మూర్తివిభవే
పరగ్రన్థాన్ పరమశివ జానే పరమతః ||
मनस्ते पादाब्जे निवसतु
वचः स्थोत्रफणितौ
करौ चाभ्यर्चायां
श्रुतिरपि कथाकर्णनविधौ |
तव ध्याने बुद्धिर्नयनयुगळं मूर्तिविभवे
परग्रन्थान् परमशिव
जाने परमतः ||
My Lord Parama Shiva, Let my mind and soul stay on your feet, let my talk
be of great praise to you, let my hands be worshipping you, let my ears stay
always listening to your stories. Let my conscience be ever lingering on you
and my eyes affixed on your divine form. How could ever be it that beyond this
state I know about other scriptures?
Sloka -8
యథా బుద్ధిశ్శుక్తౌ రజతమితి కాచాస్మని మణి –
ర్జలే పైస్టే క్షీరం భవతి మృగతృష్ణాసు సలిలమ్ |
తథా దేవభ్రాంత్యా భజతి భవదన్యం జడజనో
మహాదేవేశం త్వాం మనసి చ న మత్వా పశుపతే ||
यथा बुद्धिश्शुक्तौ रजतमिति काचास्मनि मणि –
र्जले पैष्टे क्षीरं भवति मृगतृष्णासु सलिलम् |
तथा देवभ्रान्त्या भजति भवदन्यं जडजनो
महादेवेशं त्वां मनसि च न मत्वा पशुपते ||
O Lord
Pashupathi! You are the God of all the universe and Lord of Lords. These people
serving other gods are foolish and do not mind you or worship you. Their
intellect is such that they believe an empty oyster shell as silver and a shard
of glass as a gem and who think that flour mixed with water will have milk and
a mirage has water in it.
Sloka -9
గభీరే కాసారే విశతి విజనే ఘోరవిపినే
విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతిః |
సమప్యైకం చేతస్సరసిజముమానాథ భవతే
సుఖేనావస్థాతుం జన ఇహ న జానాతి
కిమహో ||
गभीरे कासारे विशति विजने घोरविपिने
विशाले शैले भ्रमति कुसुमार्थं जडमतिः |
समप्यैकं चेतस्सरसिजमुमानाथ भवते
सुखेनावस्थातुं जन इह न जानाति किमहो ||
Hey Umanatha! People are so dull witted that they enter deep lakes, wander
in forests, climb mountains high for flowers to worship you with. What a pity
my lord, that they do not realise that just by offering you one lotus with
complete devotion they can attain eternal bliss.
Sloka -10
నరత్వం దేవత్వం నగవనమృగత్వం మశకతా
పశుత్వం కీటత్వం భవతు విహగత్వాదిజననమ్ |
సదా త్వత్పాదాబ్జస్మరణపరమానన్దలహరీ
విహారాసక్తుం చేత్ హృదయమిహ కిం తేన వపుషా ||
नरत्वं
देवत्वं नागवणमृगत्वं मशकता
पशुत्वं
कीटत्वं भवतु विहगत्वादिजननम् |
सदा
त्वत्पादाब्जस्मरणपरमानन्दलहरी
विहारासक्तुं
चेत् हृदयमिह किं तेन वपुषा ||
Whether I have this birth in
a human form, or an immortal form, an animal form that resides in mountains or
forests or a small fly, a beast, insect or a bird, my heart here is always keen
on enjoying the eternal bliss in the waves of worship of your lotus feet. How
does this bodily form matter, My Lord?
Sloka -11
వటుర్వా గేహీ వా యతిరపి జటీ వా తదితరో
నరో వా యః కశ్చిద్భవతు భవ కిం తేన భవతి |
యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే
తదీయస్త్వం శంభో భవసి భవభారం చ వహసి ||
वटुर्वा गेही वा यतिरपि जटी वा तदितरो
नरो वा यः कश्चिद्भवति भव किं तेन भवति |
यदीयं हृत्पद्मं यदि भवदधीनं पशुपते
तदीयस्त्वं शम्भो भवसि भवभारं च वहसि ||
Whether it is a bachelor, or a householder, an ascetic or a saint, a human
or something else, whatsoever it is, O
the source of all the creation, Bhava,
if the lotus heart of his is dedicated to you, O, the ruler of all the animals,
Pasupathe, all his mundane burdens are borne by you.
Sloka -12
గుహాయాం గేహే వా బహిరపి వనేऽవాద్రిశిఖరే
జలే వా వహ్నౌ వా వసతు వసతేః కిం వద ఫలమ్ |
సదా యస్యైవాంతఃకరణమపి శంభో తవ పదే
స్థితం చేధ్యోగోऽసౌ స చ పరమయోగీ స చ సుఖీ ||
गुहायां गेहे वा बहिरपि वनेऽवाद्रिशिखरे
जले वा वह्नौ वा वसतु वसतेः किं वद फलम् |
सदा यस्यैवान्तःकारणमपि शम्भो तव पदे
स्तिथं चेध्योगोऽसौ स च
परमयोगी स च सुखी ||
Let
him live in a cave or a home, outside or in a forest or on the mountain top, in
the water
or in fire. Do tell, what purpose is (such) a residence ? He whose mind also
(in addition
to the external senses) is always fixed on your feet, Oh Sambhu, he alone is a supreme saint, he alone is a happy man.
Sloka -13:
అసారే సంసారే నిజ-భజన దూరే
జడధియా
భ్రమంతం మామంధం పరమకృపయా పాతుముచితం |
భ్రమంతం మామంధం పరమకృపయా పాతుముచితం |
మదన్యః కో దీనస్తవ
కృపణరక్షాతినిపుణ
స్త్వదన్యః కో వా మే
త్రిజగతిశరణ్యః పశుపతే ||
నిస్సారమైన ఈ సంసారచక్రభ్రమణములో
పడి, నన్ను నేను తెలుసుకోలేక అంధుడినై జడత్వముతో తిరుగుతున్న నన్ను నీ పరమకృప చేత రక్షించుట
నీకు సముచితము కదా? నావంటి పేదలను రక్షించుటలో నిపుణుడివే, నా కంటే దీనుడు
ఎవ్వడున్నాడయ్యా నీకు? త్రిలోకములనూ రక్షింపదగినటువంటి ప్రభువువు, నీ కంటే
నాకెవ్వరున్నారు ప్రభో, పశుపతే.
असारे संसारे
निज-भजन दूरे जडधिया
भ्रमन्तं मामन्धं परमकृपया
पातुमुचितम् |
मदन्यः को दीनस्तव
कृपणरक्षातिनिपुण
स्त्वदन्यः को वा मे
त्रिजगतिशरण्यः पशुपते ||
I am roaming around blind
My Lord, in this repetitive wheel of mundane causation without even
knowing self. You are by all means the only one who can extricate me from this
with your eternal compassion. Who else is more salacious than me to you My
Lord, and who else is for me if not you O, Pasupathi, as you are the protector
of the three worlds?
Sloka -14:
ప్రభుస్త్వం దీనానాం ఖలు
పరమబంధుః పశుపతే
ప్రముఖ్యోऽహం తేషామపి కిముత బంధుత్వమనయోః ।
త్వయైవ క్షంతవ్యాశ్శివ
మదపరాధాశ్చ సకలాః
ప్రయత్నాత్కర్తవ్యం
మదవనమియం బంధు సరణిః ।।
ఓ పశుపతినాథా, దీనులయెడ
పరమబంధువు అని, వారికందరికీ ప్రభువువనీ కదా నీకు ప్రశస్తి. అట్టి దీనులలో
ప్రముఖుడైన వాడిని నేనయ్యా. ఇంకెందుకు మరలా వివరణ మన బంధుత్వమరయ. నా అపరాధములన్నీ నీ
చే కదా క్షమించబడినట్టివి, అట్టి నీ వల్ల ప్రయత్నం చేసి నన్ను కాపాదవలెను కదా. ఇదే
కదా ఈ లోకమునందు బంధురీతి.
प्रभुस्त्वं दीनानां
खलु परमबन्धुः पशुपते
प्रमुख्योऽहम् तेषामपि
किमुत बन्धुत्वमनयोः।
त्वयैव
क्षन्तव्याश्शिव मदपराघाश्च सकलाः
प्रयत्नात्कर्तव्यं
मदवनमियं बन्घु सरणिः।।
Hey Pashupatinatha, You are the most merciful relative to all the poor
and needy. I am the foremost of them all. What else can be said about our
relation now? You are the most eligible to pardon all of my sins. As is customary in relationships, you
must endeavour to save me and extricate me from all sins and blunders I might
have committed.
Sloka – 15
ఉపేక్షా నో చేత్కిం న హరసి భవద్ధ్యానవిముఖాం
దురాశాభూయిష్టాం విధిలిపిమశక్తో యది భవాన్ |
శిరస్తద్వైధాత్రం న నఖలు సువృత్తం పశుపతే
కథం వా నిర్యత్నం కరనఖముఖేనైవ లులితమ్ ||
హే పశుపతినాథా, నీ ధ్యానము
నుండి నన్ను మరలించి దురాశచేత నా మనసును నింపుచున్న ఈ విధిరాతను మార్చలేకున్నావా?
చక్కగా గుండ్రముగనుండిన ఆ బ్రహ్మశిరస్సును నీవు అనాయాసముగా నీ చేతిగోటితో త్రెంచిన
నీకు ఇది నాయందు ఉపేక్ష కాక మరింకేమి
దేవా?
ಉಪೇಕ್ಷಾ ನೋ ಚೇತ್ಕಿಂ ನ ಹರಸಿ
ಭವದ್ಧ್ಯಾನವಿಮುಖಾಂ
ದುರಾಶಾಭೂಯಿಷ್ಟಾಂ
ವಿಧಿಲಿಪಿಮಶಕ್ತೋ ಭವಾನ್ |
ಶಿರಸ್ತದ್ವೈಧಾತ್ರಂ ನ ನಖಲು
ಸುವೃತ್ತಂ ಪಶುಪತೆ
ಕಥಂ ವಾ ನಿರ್ಯತ್ನಂ
ಕರನಖಮುಖೇನೈವ ಲುಲಿತಮ್ ||
ಹೇ ಪಶುಪತೆ, ತವದಿವ್ಯಧ್ಯಾನದಿಂದಲಿ
ವಿಮುಖನಾಗಿಸುತ ರಾಶಿ ರಾಶಿ ದುರಾಶೆ ತುಂಬಿಸುತ ಮನಕೆ ನನ್ನ ಕೆಡಿಸಿದ ಹಣೆಯ ಬರಹ ಬದಲಿಸದೆ
ಉಪೆಕ್ಷೆಯದು ಯೇಕೆ? ಬ್ರಹ್ಮ ಶಿರವನ್ನು ಬರಿಯ ಕೈಯುಗಿರಿಯಿಂದಲೇ ತರಿದ ಶಕ್ತನು ನೀನು, ಇಂದು
ಹೀಗೇಕೆ?
उपेक्षा नो चेत्किं न हरसि भवद्ध्यानविमुखां
दुराशाभूयिष्टां विधिलिपिमशक्तो यदि भवान् |
शिरस्तद्वैधात्रं न नखलु सुवृत्तं पशुपते
कथं वा निर्यत्नं करनखमुखेनैव लुलितम् ||
Hey Pasupathinatha, My mind if full of evil desires and greed and adrift
from contemplating on you, because of my fate thus written by Brahma. Why is it
that you have been indifferent to me as if incapable of changing my fate when
you have effortlessly disengaged the same Brahma’s head with mere tip of your
nail.
Sloka – 16
విరించిర్దీర్ఘాయుర్భవతు భవతా తత్పరశిర
శ్చతుష్కం సంరక్ష్యం స ఖలు భువి దైన్యం లిఖితవాన్ |
విచారః కో వా మాం విశదకృపయా పాతి శివ తే
కటాక్ష్యవ్యాపారః స్వయమపి చ దీనావనపరః ||
ఓ నిర్మలస్వరూపా! ఈశ్వరా! బ్రహ్మదేవుని మిగిలిన (నీ చేత
ఒక తల తరగబడి) నాలుగు శిరములు సంరక్షింపబడి దీర్ఘాయువు పొందదగినట్టి వాడు కదా. ఆయన
కదా భూమిపై మాకు ఈ దీనత్వము లిఖించినవాడు. ఈ దీనత్వము గూర్చి నేను చింతించుట
దేనికి ప్రభో, దీనులను రక్షించుటలో సహజచతురుడవైన నీ క్రీగంటి చూపు స్వయముగా మమ్ము
రక్షించుచుండగా!
विरिञ्चिदीर्घायुर्भवतु भवता तत्परशिर
श्चतुष्खं संरक्ष्यं स खलु भुवि दैन्यं लिखितवान |
विचारः को वा मां विशदकृपया पाति शिव ते
कटाक्षयव्यापारः स्वयमपि च दीनावनपरः ||
My Lord! Shiva, the most pristine, it’s quite apropos that the remaining
four heads of Brahma Deva be protected by you so a long life is endowed on him. For he is the
one that has imposed this tribulation on us by his writings. Howbeit, I lament
not on my woes - in that, I believe an askant glimpse from you would be enough
to extricate me from all those, for you are the one keen on caring for the
barren kindred.
Sloka –
17:
ఫలాద్వా పుణ్యానాం
మయి కరుణయా వా త్వయి విభో
ప్రసన్నేऽపి
స్వామిన్ భవదమలపాదాబ్జయుగళమ్ |
కథం పశ్యేయం మాం స్థగయతి నమస్సంభ్రమజుషాం
నిలింపానాం శ్రేణిర్నిజకనకమాణిక్యమకుటైః
||
హే విభో, పరమేశ్వరా!
నా పూర్వ సంచితపుణ్యఫలప్రదమో, లేక నా యందు నీకు గల అపారకరుణామహత్యమో, నీవు నాకు ప్రసన్నుడవగునేని
గాక, నీ నిర్మలపదద్వంద్వసరోజ దర్శనాభాగ్యము లేకపోయేనే? సకల దేవతాసమూహహేమమాణిక్యఖచిత
కిరీటముల కాంతిచే నా కనుగవలు మిరుమిట్లు గొల్పుచున్న నీ పాదయుగళమును
మానవమాత్రుడనైన నేను ఎట్లు దర్శింతునీశ్వరా?
फलाद्वा पुण्यानां मयि करुणया वा त्वयि विभो
प्रसन्नेऽपि स्वमिन् भवदमलपादाब्जयुगळम् |
कथं पश्येयं मां स्थगयति नमस्संभ्रमजुषां
निलिंपानां स्रेनिर्निजकनकमाणिक्यमकुटैः ||
Hey Vibho, the Lord of all
the creation! Be it the fortuitousness of my previous good deeds or the bliss
of your eternal compassion on me, even if you are graceful enough to bestow
such, I have not the godsend of having a look at your lotus feet. In this
clamouring group of the great Gods at your feet, I, a mere human have not the
untrammeled vision of your feet which are obscured by the glitter of the Gods’
gem-studded, golden crowns.
Sloka 18:
త్వమేకో లోకానాం పరమఫలదో
దివ్యపదవీం
వహంతస్త్వన్మూలం పునరపి
భజంతే హరిముఖాః |
కియ ద్వా దాక్షిణ్యం తవ శివ మదాశా
చ కియతీ
కదా వా మద్రక్షాం వహసి
కరుణాపూరితదృశా ||
హే శివా, నిత్యసత్యసుఖదాయకుడవైన
నిన్ను విష్ణుమూర్తి మొదలైనటువంటి వారలే మహాదివ్యపదవులు కలిగియున్ననూ, అది నీ మూలముగనేనని
యెఱిగి నిన్ను నిరతమూ భజించుచున్నారు. నీ దయ ఎంతటి గొప్పది కదా ప్రభో, మఱి నా యాశ
ఎంతటిది? ఎప్పుడు నీ కరుణాపూరిత దృక్కులు నాపై ప్రసరింపజేసి నా రక్షాభారమును
వహించేదవో కదా?
त्वमेको लोकानां परमफलधो दिव्यपदवीं
वहन्तस्त्वन्मूलं पुनरपि भजन्ते हरिमुखाः|
किय द्वा दाक्षिण्यं तव शिव मदाशा च कियती
कदा वा मद्रक्षां वहसि करुणापूरितदृशा ||
Hey Shiva, the provider of
the perennial bliss, even though felicitated by great positions, you are being
worshipped by the likes of Lord Vishnu fully cognizant of the fact that the
reason behind that is yourself. How unfathomable is your glory and how little
is my want? When do you grace me, My Lord with your blissful sight that could
bear the burden of my protection?
Sloka -19:
దురాశాభూయిష్ఠే
దురధిపగృహద్వారఘటకే
దురంతే సంసారే దురితనిలయే దుఃఖజనకే |
మదాయాసం కిం న వ్యపనమసి కేస్యోపకృతయే
వదేయం ప్రీతిశ్చేత్తవ శివ కృతార్థాః ఖలు వయమ్ ||
దురంతే సంసారే దురితనిలయే దుఃఖజనకే |
మదాయాసం కిం న వ్యపనమసి కేస్యోపకృతయే
వదేయం ప్రీతిశ్చేత్తవ శివ కృతార్థాః ఖలు వయమ్ ||
దురాశయందు పెక్కు
మక్కువగలదియూ, క్రూరమైనట్టిరాజులయొక్క ద్వారమందిరములకు చేర్చునట్టిది, అవసానమందు
నికృష్టమైన దశలను కల్గించునట్టిది, పాపములకు ఉనికిపట్టు అయినట్టిది, దుఃఖములకు మూలకారణము
అయిన ఈ సంసార చక్ర పరిభ్రమణమునుండి ప్రభవించిన నా ఆయాసమును, శివ మహాదేవా! ఎవరికి (బ్రహ్మదేవునికా –
అని ఆంతర్యము) ఉపకారమొనర్చ తీర్పకుంటివి? తెఱిగించు ప్రభో. నీకు స్థిరభక్తపరత్వమున్న అది
మాకు చాలును కదా! నిన్ను వేడి మేము కృతార్థులమయ్యెదమయ్యా.
दुराशाभूयिष्ठे दुरधिपग्रुहद्वारघटके
दुरन्ते संसारे दुरितनिलये दुखःजनके |
मदायासं किं न व्यपनमसि केस्योपकृतये
वदेयं प्रीतिश्चेत्तव शिव कृतार्थाः खलु वयम् ||
दुरन्ते संसारे दुरितनिलये दुखःजनके |
मदायासं किं न व्यपनमसि केस्योपकृतये
वदेयं प्रीतिश्चेत्तव शिव कृतार्थाः खलु वयम् ||
Greatly avaricious and
that would cause us to beseech the entrances of the cruel kings, that which
would grant us only the most miserable of the plights at the end, the
progenitor of all the sins and the woes, this crestfallen wheel of
platitudinous life has caused us great sorrow My Lord, Shiva Mahadeva! Do not
you extricate us from this to placate someone? (Brahma who has written this on
our foreheads). Truth be it, that if you are the savior of your devotees, angst
aren’t we, for we beseech only you and will be saved.
Sloka -20:
సదా మోహాటవ్యాం చరతి
యువతీనాంకుచగిరౌ
నటత్వాశాశాఖాస్వటతి ఝటితి
స్వైరమభితః
కపాలిన్ భిక్షో మే హృదయకపిమత్యన్తచపలం
దృఢం భక్త్యా బధ్వా శివ భవదధీనం
కురు విభో.
శివా, కపాలినే, ఆధిభిక్షో!
సదా మోహమనే అడవిలో చరించుచూ, యువతీస్తనపర్వతసీమలయందు నాట్యమాడుతూ, నిజదారాసుతజనపాశాశాశాఖలయందు
ఆడుచూ, నలువైపులా స్వైరవిహారము చేయుచూ, అత్యంతచపలమైనట్టి నా హృదయమును ధృడమైన నీ
భక్తితో కట్టివేసి భవధీనం చేయి ప్రభో!
सदा मोहाटव्यां चरति युवतीनांकुचगिरौ
नटत्वाशाशाखास्वटति झटिति स्वैरमभितः
कपालिन् भिक्षो मे हृदयकपिमत्यन्तचपलं
दृडं भक्त्या बध्वा शिव भवदधीनं कुरु विभो
O Shiva, the Wearer of the garland of skulls (You are the one that keeps
all the irregularities under control), the Mendicant (who begs away all sins
from us), always wandering in the forests of this mundane desires, dancing with
ecstasy on the mountain like bosoms of youthful women, playing on the branches
of the want, in a vain swift wandering across the four corners of the world, my
mind is being very volatile. Let it be bound in your devotion My Lord and
become subservient to you.
Sloka – 21:
ధృతిస్తంభాధారాం ధృడగుణనిబద్ధాం సగమనాం
విచిత్రాం పద్మాఢ్యాం ప్రతిదివససన్మార్గఘటితాం |
స్మరారే, మచ్చేతస్స్ఫుటపటకుటీం ప్రాప్య విశధాం
జయ స్వామిన్, శక్త్యాసహశివగణైఃస్సేవిత విభో ||
స్వామీ, సర్వంతర్యామీ, స్మరుని (మన్మధుని) సంహరించినవాడా, ధృడమైన
స్తంభములు గల్గినట్టిది, త్రిగుణాత్మకమైన (సత్త్వ, రాజస్స్తమోగుణములు) పాశాములచే బంధించబడినట్టిది,
నిజస్వేచ్చానుగమనమైనట్టిది, విచిత్రమైనట్టిది, పద్మస్వరూపమున భాసించునట్టిది,
ప్రతిదినమూ సన్మార్గముననే కోరిచేరునట్టిది, స్పష్టమైనధవళకాంతిగల్గినట్టిది, అయిన
నా ఈ మదీయమానసకుటీరమును సమస్తశివగణసేవితుడవై, అర్ధాంగీసహితుడవై (శక్తిసమేతుడవై)
జయముగా ప్రవేశించుము ప్రభో.
धृतिस्तंभाधारां धृडगुणनिबद्धां सगमनां
विचित्रां पद्माड्यां प्रतिदिवससन्मार्गघटितां |
स्मरारे, मच्चेतस्स्फुटपटकुटीं प्राप्य विशदां
जय स्वमिन्, शक्त्यासहशिवगणैःस्सेवित विभो ||
My Lord, the Omnipresent,
the one who vanquished Manmadha (the god of Love, Cupid), buttressed by mighty
colonnades though, bound by three fibrils (Sattwa, Rajas, Tamas), ever
pervading and quite intriguing in the form of a lotus, seeking always the righteous
path to the Brahman, shining in all its pearly glow, my heart longs for your
presence with your wife Shivaa (Goddess Parvati) ever glorified by the hymns
sung by your loyal legion of servants. Please make it your stay in all your
glory, My Lord.
Sloka -22:
ప్రవేశోద్యుక్తస్సన్ భ్రమతి బహుధా తస్కరపతే |
ఇమంచేతశ్చోరం కథమిహసహే శంకర, విభో
తవాధీనం కృత్వా మయి నిరపరాధేకురు కృపా ||
హే శంకరా, పరధనగ్రహనమునందు ఆసక్తికలిగి వశీకరణాదిమంత్రములచేత, వారి ఇండ్లలోని దానములను అపహరించవలెనన్న నా ఈ మనస్సు అనెడి చోరుడు బహు భ్రమించుచున్నాడు, వీనిని నేను ఎట్లు సహించగలను ప్రభో? ఓ తస్కరపతే, నీవు దొంగలందరికినీ ప్రభువువు అని పేరు (నమకము.|| ...తస్కరాణాం పతయే నమో నమో... - వారి పాపములను సంగ్రహించుటయందు అని పద్యార్థము). నీవు కాక మరి వేరెవరు కలరు నా ఈ మనస్సు అనెడి చోరున్ని నిగ్రహించు సమర్థుడు. నేను నా మనస్సును నీ ఆధీనము చేయుచున్నాను. ప్రభో! నన్ను నీవు నీ కృపతో అనుగ్రహించి నిరపరాధిని గావింపుము.
प्रलोभाद्वैरर्थाहरणपरतन्त्रो धनिगृहे
प्रवेशोद्युक्तस्सन् भ्रमति बहुधा तस्करपते |
इमंचेतश्चोरं कथमिहसहे शंकर विभो
तवाधीनं कृत्वा मयि निरपराधे कुरु कृपा ||
My lord! Interested in the riches of the wealthy my mind is fluctuating on entering their houses with the motive of stealing their money which is fully knowing on all the gullible tactics of making them surrender. How do I bear this pain, O, the pious one? I shall surrender my mind and senses to you, for you are the lord of all the thieves (as eulogised in sacred hymns - To be taken here as in stealing away their sins). I shall then be not culpable of any of its sinister thoughts my Lord by your grace.
Sloka – 23:
కరోమి త్వత్పూజాం సపది సుఖదో మే
విభోవిధిత్వం విష్ణుత్వం దిశసి ఖలు తస్యాః ఫలమితి |
పునశ్చత్వాంద్రష్టుం దివిభువివహన్ పక్షిమృగతా
మదృష్ట్వాతత్ఖేదం కతమిహసహే శంకర విభో ||
హే విభో! నా పూజకు నీవు సత్వరమే ప్రసన్నుడవయ్యి నాకు వరములను ప్రసాదింపగలవు. (ఆశుతోషుడని కదా ఈశ్వరునికి మరొక్క పేరు). కానీ నా పూజకు ప్రసన్నుడవైన నీవు నాకు బ్రహ్మపదవిని కానీ విష్ణుపదవిని కానీ ఇస్తే, మరలా నిన్ను చూచుటకు నేను పక్షిరూపమును గానీ (బ్రహ్మ హంసరూపములో లింగోద్భవమూర్తి యొక్క అదిని తెలుసుకోవడానికి ప్రయత్నించినది ఉదాహరించి) కానీ మృగరూపము (విష్ణువు సూకరరూపము దాల్చి మూర్తి లింగాంతము చూచుటకు యత్నింపడము). దాల్చి భూనభోంతరాళములయందు సంచరించవలసిన గతి పట్టును కదా. నిన్ను మరలా చూడలేని కారణమున కలగిన ఆ దుఖమును నేను ఎట్లు సహింపగలను ప్రభో, శంకరా!
- శ్రీ ఆదిశంకరభగవత్పాదులు "ప్రభో, శంకరా! నాకు నీవు ప్రసన్నుడవగుదువేని, బ్రహ్మేంద్రవిష్ణుపదవులు వద్దు కానీ సదా నీ సాయుజ్యమును ప్రసాదించు"మని కోరడము, ఈ పద్యవిశేషము.
करोमि त्वत्पूजां सपदि सुखदो मे विभो
विधित्वं विष्णुत्वं दिशसि खलु तस्याः फलमिति |
पुनश्चत्वाम्द्रष्टुं दिविभुविवहन् पक्षिमृगता
मदृष्ट्वातत्खेदं कतमिहसहे शंकर विभो ||
I worship you My Lord! you are the most generous and will be able to bestow anything on me. However, when you are pleased you can verily grant me the post of Lord Brahma or Lord Vishnu. Then I should traverse the earth and the heavens either as an animal or a bird to see you My Lord. (As Lord Brahma and Lord Vishnu once did in the forms of a swan and a hog to find the ends of the Lord Lingodbhavamurthy). If I am unable to see you, how can I bear that sorrow? My Lord.
-Sri Bhagavatpaada is asking here for Lord Shiva's eternal grace and not any mundane or even divine indulgences.
Sloka – 24:
కదా వా కైలాసే కనకమణిసౌధే సహగణై
ర్వసన్ శంభోరగ్రేస్ఫుటఘటితమూర్ధాంజలిపుటః
విభో! సాంబ! స్వామిన్! పరమశివపాహీతినిగదన్
విధాతౄణాం కల్పాన్ క్షణమివ వినేష్యామి సుఖతః ||
ప్రభో! సాంబా, మహాదేవా, నీ కృపకు పాత్రుడనై కైలాసశిఖరాగ్ర
కనకమణిరత్న ఖచిత సౌధములు గల నీ ఆవాసమునండు “స్వామీ, పరమశివా! నన్ను రక్షింపు” మని
పలుకుచూ, ముకుళిత కరాంజలి నా నుదుటన కూర్పబడినవాడినై, నీ అనుచరగణముతోగూడి, బ్రహ్మచేత
కల్పింపబడిన ఈ కల్పములనెన్నైనగానీ క్షణమాత్రమని తలచుచూ ఎప్పుడు గడిపెదనో గదా?
कदा वा कैलासे कनकमणिसौधे सहगणै
र्वसन् शंभोरग्रेस्फुटघटितमूर्धाञ्जलीपुटः
विभो, साम्ब, स्वमिन्, परमशिवपाहीतिनिगदन्
विधातॄणां कल्पान् क्षणमिव विनेष्यामि सुखतः ||
My Lord, Shambho, when shall you bestow on me the
eternal happiness similar to that of your attendants residing in the
gem-studded golden quarters atop the Kailasha mountain, rendering your praises
that “Hey Paramashiva, thou are our saviour” and dwell in that happiness for
aeons together that are created by Brahma as if they are not more than that of
a second, with my hands bound in your salutation ever affixed on my forehead?
Sloka – 25:
స్తవైర్బ్రహ్మాదీనాం జయజయవచోభిర్నియమినాం
గణానాం కేలీభిర్మదకలమహోక్షస్య కకుది |
స్థితం నీలగ్రీవం త్రినయనముమాశ్లిష్టవపుషం
కదా త్వాం పశ్యేయం కరధృతమృగం ఖండపరశుమ్ ||
ప్రభో! జయజయధ్వానములు చేయుటకై బ్రహ్మాదిదేవతలచేత నియోగింపబడినట్టి
ఋషిసమూహముగలవాడునూ, ప్రమధగణకేళీనినాదమహాసంకులమునందున్నవాడునూ, అత్యంతసంతోషముచేత
నిన్ను తన మూపురముపై కూర్చుండబెట్టుకున్న వృషభరాజముగలవాడునూ, నీలకంఠముగలవాడునూ,
త్రినేత్రుడునూ, ఉమాదేవిచేత ఆలింగింపబడినట్టి అర్ధదేహుడునూ, ఒకచేతియందు జింకచేత,
మరొక్కచేతియందు గండ్రగొడ్డలిచేతనూనొప్పువాడునూనైనట్టి నిన్ను నేను ఎప్పుడు
దర్శించగలను ప్రభో?
स्तवैर्ब्रह्मादीनां जयजयवचोभिर्नियमिनां
गणानां केलीभिर्मदकलमहोक्षस्य ककुदि |
स्थितं नीलग्रीवं त्रिनयनमुमाश्लिष्टवपुषं
कदा त्वां पश्येयं करधृतमृगं खण्डपरशुम् ||
My Lord, When shall I have the chance of your
vision, You who has the anointed saints by Brahma to sing the hyms as singers,
You, who has the crowd of various pramada ganas surrounded in great ecstasy,
You, my Lord, who has made the happiest Ox in the universe as your seat, You,
Whose neck is greenish in colour by taking in the poison to save the universe,
You, Who has three eyes and Whose hlaf of the body is always is embraced by the
Godess Umadevi, You, Who has in one hand a deer and other hand an axe
symbolising the balance between life and death, My Lord, Shambho, when shall I
have the vision of You.
Sloka - 26:
కదా వా త్వాం దృష్ట్వా గిరిశ, తవ
భవ్యాంఘ్రియుగళం
గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ |
సమాశ్లిష్యాఘ్రాయ స్ఫుటజలగంధాన్ పరిమళా
నలభ్యాం బ్రహ్మాద్యైర్ముదమనుభవిష్యామి హృదయే ||
గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ |
సమాశ్లిష్యాఘ్రాయ స్ఫుటజలగంధాన్ పరిమళా
నలభ్యాం బ్రహ్మాద్యైర్ముదమనుభవిష్యామి హృదయే ||
ఓ గిరీశా, భవదీయపాదపద్మయుగళమును గాంచి
నేను నా హస్తద్వయంబుతో, నా శిరస్సునందో, నా కనుదోయినందో, వక్షస్థలమునందో, చేర్చుకొని, ప్రఫుల్లపద్మవికాసగంధమును ఆస్వాదించుచూ,
బ్రహ్మాద్యనేక దేవతా సమూహమునకు కూడా అనుభవింపశక్యము గానట్టి ఆ
సంతోషమును ఎప్పుడు చవిచూచెదనో కదా? ప్రభో!
తా: నా హృదయాన్తరాళమందు నీవెప్పుడు
సుస్థిరముగనుండి నీ పాదద్వయసంపర్కానందమును నాకందజేతువో గదా ప్రభో!
कदा वा त्वां दृष्ट्वा गिरिश! तव भव्याङ्घ्रियुगळं
गृहीत्वा हस्ताभ्यां शिससि नयने वक्षसि वहन् |
समाश्लिष्याघ्राया स्फुतजलगन्धान् परिमळा
नलाभ्यां ब्रह्माद्यैर्मुदमनुभविष्यामि हृदये ||
गृहीत्वा हस्ताभ्यां शिससि नयने वक्षसि वहन् |
समाश्लिष्याघ्राया स्फुतजलगन्धान् परिमळा
नलाभ्यां ब्रह्माद्यैर्मुदमनुभविष्यामि हृदये ||
O lord of the mountains, when shall you grant me the favour of
your lotus feet ever pervading in my hands (while doing archana), on my head
(as an ever occupying thought), to my eyes (ever in the presence of your
vision), my bosom (as the life in me) and when shall I be graced with the scent
of your Lotus Feet in full blossom.
Meaning: When My lord, will you be pleased with me to talk into your surrendering all my earthly senses and I will ever prevail in the joy of your presence.
Meaning: When My lord, will you be pleased with me to talk into your surrendering all my earthly senses and I will ever prevail in the joy of your presence.
Sloka - 27:
కరస్థే హేమాద్రౌ గిరిశ, నికటస్థే ధనపతౌ
గృహస్థే స్వర్భూజామరసురభి చింతామణిగణే |
శిరస్స్థే శీతంశౌ చరణయుగళస్థేऽఖిలశుభౌ
కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః
||
హే పర్వతనివాసా, ఈశ్వరా! నీ చేతియందు మేరుపర్వతము బంగారుకాంతులీనుచుండగా,
నీ సమీపముననే నవనిధ్యాదిపతియగు కుబేరుడు ఉన్నాడు (ఈశ్వరుడు కైలసవాసి మాత్రమే, కైలసాధిపతి
కుబేరుడు), ఇష్టార్థఫలప్రదాయినులగు కల్పవృక్షము, కామధేనువు, చింతామణిగణములచే నీ
గృహమొప్పుచున్నది. శీతాంశుశోభితుడగు చంద్రుడు నీ శిరస్సునందలకరించియున్నాడు. నీ చరణయుగళమందు
సమస్తశుభములున్నవి. ప్రభో! ఇట్టి నీకు నేనేమి ఇవ్వగలవాడను, నా మనస్సును తప్ప.
करस्थे हेमाद्रौ
गिरिश, निकाटसथे धनपतौ
गृहस्थे
स्वर्भूजामरसुरभि चिन्तमनिगणे |
शिरस्थे शीतम्शौ
चरनयुगलस्थेऽखिलशुभौ
कमर्थं दास्येऽहं भवतु
भवदर्थं मम मनः ||
My Lord, the dweller of the mountains, in your hand is thegolden mountain
of Meru. The lord of nine fortunes, Kubera is next to you (God Shiva is just a
resident of the mount Kailasa, the actual owner is Kubera), your house is
filled by the wish-yielding tree (Kalpavriksha), the boon-giving cow
(Kamadhenu) and the gem that yields every thought (Chintamani). Adorned on your
head as a gem is the Moon himself. What shall I surrender to you my lord,
except my mind (in the form of eternal thought of yours).
Sloka 28:
సారూప్యం తవపూజనే శివ, మహాదేవేతి సంకీర్తనే
సామీప్యం శివభక్తిధుర్యజనతా సాంగత్య సంభాషణే
సాలోక్యం సచరాచరాత్మకతనుధ్యానే భవానీపతే
సాయుజ్యం మమసిద్ధమత్రభవతి స్వామిన్, కృతార్థోऽస్మ్యహమ్
శివా, మహాదేవా, నీ పూజనము చేత నాకు నీ సారూప్యమగుచున్నది
(నా రుద్రో రుద్రమార్చయేత్ అను విధముగా నాలో నిన్ను ఆరాధించుకుంటూ ఇవ్విధమైన
స్థితి పొందుతున్నాను). నీ శుభమంగళభద్రస్వరూపము నా వెన్నంటియుండునట్లు భావన
కలుగుచున్నది, నాకు నీ దివ్య సంకీర్తనాలాపముచేత, శివభక్తిపరాయణచిత్తులైన సజ్జనసాంగత్య
సంభాషణావిధమున నాకు నీ సాలోక్యమగుచున్నది (నేనున్న చోట నీవున్నట్టు విభ్రాంతి
కలుగుచున్నది). స్థావరజంగమాత్మకమైన ఈ సృష్టిలో నిన్ను గాంచినప్పుడు, నీ భవ్యసాయుజ్యము
(మనోవాక్కరణాది పంచతన్మాత్రైక్యము) నాకు ఇక్కడనే లభ్యమగుచున్నది ప్రభో, ఓ భవానీపతే!
सारूप्यं तवपूजने शिव, महादेवेति संकीर्तने
सामीप्यं शिवभक्तिधुर्यजनता सान्गत्यसंभाषणे
सालोक्यं सचराचरात्मक तनुध्याने भवानीपते
सायुज्यं ममसिद्धमत्रभवति स्वमिन् कृतार्थोऽस्म्याहम्
Shiva,
Mahadevaa, I attain the state of yourself by your worship (As said in the
scriptures that – Only a person who considers himself as Rudra can worship God
Rudra). I feel the presence of you when I hear to the sacred hymns sung in your
praise by the most pious of your devotees. I feel myself engrossed in your divine sphere
when I talk to and be in the presence of the saints whose thoughts ever pervade
on you. I attain the state of your eternal bliss, when I see you in this
mundane moving and stationary world (As if I have surrendered all the five
derivative states of my senses). I attain all of these here on this earth, My
Lord, the lover of Godess Bhavani.
Sloka 29:
త్వత్పాదాంబుజమర్చయామి పరమం త్వాం చిన్తయామన్వహం
త్వామీశం శరణం వ్రజామి వచసా త్వామేవ యాచే విభో
వీక్షాం మే దిశ చాక్షుషీం సకరుణాం దివ్యైశ్చిరం
ప్రార్థితాం
శంభో, లోకగురో మదీయ మనసస్సౌఖ్యోపదేశం కురు
సమస్త విశ్వాన్తర్బహిస్థితస్వరూపుడవైన ఈశ్వరా, విభో,
నేను నీ పాదపద్మములనే సదా అర్చించెదను, సర్వవ్యాపివి, సర్వశక్తుడవునైన నీ చింతయే
నాకు సదా కలుగుచున్నది. సర్వేశ్వరుడవాణి నమ్మి నిన్నే నేను శరణంటిని. వాగర్థములచేతనూ
నిన్నే నేను యాచించెదను. నా చిరప్రార్థితంబైన కోరిక గాన నీ దివ్యకరుణాకటాక్షవీక్షణములను
నాపైనొక్కమారు ప్రసరింపజేయుమయ్యా, శంభో,
లోకాలకు సర్వ సౌఖ్యములను ప్రసాదించగలసమర్థుడవు. లోకగురువువైన నీవే నా మనస్సుకు
సౌఖ్యము చేకూర్చగల ఉపదేశమును గావింపుము.
त्वत्पादाम्बुजमर्चयामि परसमं
त्वां चिन्तयामन्वहम्
त्वामीशं शरणम् व्रजामि वचसा
त्वामेव याचे विभो
वीक्षां मे दिश चाक्षुषीं सकरुणां
दिव्यैश्चिरं प्रार्थितां
शम्भो, लोकगुरो मदीय मनससौख्योपदेशं
कुरु
My Lord, you arthe
pervader of all the universe maintaining its external appearance and internal
state. I always worship your lotus feet my Lord, the eternal one and the most
powerful of all the universes, I always ponder on you. My Lord, I believe in my
heart that hyou are the supreme and surrender to you. With my word and meaning
I beg of you. My Lord, please grace upon me your askance glance which has been
my eternal desire. Shambho, you are the one that is maintaining the world by
providing their wishes. You are the primal teacher, preach me the eternal
bliss.
Sloka -30:
వస్త్రోద్ధూతవిధౌసహస్రకరతా
పుష్పార్చనే విష్ణుతా
గంధే గంధవహాత్మతాన్నపచనే
బర్హిముఖాధ్యక్షతా
పాత్రేకాంచనగర్భతాస్తి
మయిచేద్బాలేందుచూడామణే
శుశ్రూషాం కరవాణితే పశుపతే,
స్వామిన్, త్రిలోకీగురో
ప్రభో, చంద్రశేఖరా,
బాలేందుధరా, నీ ఉపచారములు చేయవలెన్నన నా తరమా? త్రిలోకములకూ గురువైనటువంటివాడవు,
నీకు వస్త్రోపచారములు చేయవలెనన్న వేయి చేతులు కావలెను, సూర్యభగవానునివలె (తన
కిరణములచే సూర్యుడు సహస్రకరుదని ప్రతీతి). నీకు పుష్పార్చన చేయవలెనన్న నీ
విశ్వవ్యాపకత్వము చేత సర్వవ్యాపకుడైన సాక్షాచ్ఛ్రీమన్నారాయణుడనే కావలెను,నీకు గంధోపచారములు
గావింతుమన్న సర్వగంధవహుడైన వాయుదేవుణ్ణి కావలెను, నీకు పక్వాన్నప్రసాదమొనరింపువలెనన్న
పాకశాసనుడు, అగ్నిముఖుడు అని ప్రసిద్ధి గల దేవేంద్రుణ్ణి కావలెను. నీకు అర్ఘ్యోపచారములు
చేయుటకు, నేను హిరణ్యగర్భుడనే కావలెను. అట్టి సూర్యుడు, విష్ణువు, వాయువు,
ఇంద్రుడు, బ్రహ్మ అయిన గాని నేను నీకు పరిచర్యలు చేయ శక్తుడను గాను గదా. ప్రభో!
वस्त्रोद्धूतविदौसहस्रकरता पुष्पार्चने विष्णुता
गन्धे गन्धवहात्मतान्नपचने बर्हिमुखाध्यक्षता
पात्रे काञ्चनगर्भतास्ति मयिचेद्बालेन्दुचूदमणे
शुश्रूषां करवाणिते पशुपते, स्वमिन्, त्रिलोकीगुरो
My
Lord, Chandrasekhara, you are the very one who adorns the moon on your
forehead. For the ceremonial offering of garments to you, I am to be possessed
with thousand arms like the God of the Sun. If I were all pervasive as the God
Vishnu himself, could I worship you with flowers. If only I were capable of
spreading fragrance like the God of Wind, I can worship you with the sacred
fragrance. If only I were the Lord Indra (Who is credited for the taste of food
and who is the Lord of all heavenly lords), I can offer you the food. If only I
were God Brahma who has the stomach full of Gold, I could worship you with
sacred oblations. O the preceptor of the three universes and the lord of all
animals, Pasupati, My Lord, then I would be of service to you.
Sloka-31
నాలం వా పరమోపకారమిదం త్వేకం పశూనాంపతే
పశ్యన్ కుక్షిగతాన్ చరాచరగణాన్ బాహ్యస్థితాన్ రక్షితుమ్
సర్వామర్త్యపలాయనౌషధ మతిజ్వాలాకరం భీకరం
నిక్షిప్తం గరళం గళేనగళితం నోద్గీర్ణమేవ త్వయా
ఎల్లెడలేని నిలువక ఓడలు మరిచి పలాయనచిత్తులైన అమరులకు ఔషదీభూతమగునట్టు, నీ
కుక్షిగతములైన త్రిభువనములకు ఆపద వాటిల్లకుండునట్టు, వెలినిడిన బాహ్యస్థూలసూక్ష్మజగత్తు
నాశమొందకయుండునట్టు, పశుపతే, ఈశ్వరా, నీవు హాలాహాలభక్షణము చేసియు, దానిని నీ కంఠసీమయందే
నిలిపితివి. ఈ దృష్టాంతమొక్కటి చాలదా ప్రభో, నీ మహిమగాంచ మాకు మహిలోన.
नालं वा परोपकारमिदं त्वेकं पशूनांपते
पश्यन् कुक्षिगतान् चराचरगणान् बाह्यस्थितान्
रक्षितुं
सर्वामर्त्यपलायनौषध मतिज्वालकरम् भीकरं
निक्षिप्तं गरळं गळेनगळितं नोद्गीर्णमेव त्वया
My
lord, O Pashupati, you are the true protector of all the three realms. To save
those that are resident in our stomach and those that are moveable and
stationary out of it, you have stationed the devilish poison in your neck. This
act sure could be the cure for the disease of flight of the immortals. You have
balanced the poison in your neck so that the universe in you and out of you
stays in position. Will this act alone not suffice my lord, for us to know your
immense power?
Sloka -32:
జ్వాలోగ్రస్సకలామరాతి
భయదః శ్వేలః కథం వా త్వయా
దృష్టః కిం చ కరే
ధృతః కరతలే కిం పక్వజంబూఫలమ్ |
జిహ్వాయాం
నిహితశ్చ సిద్ధగుటికా వా కంఠదేశే భృతః
కిం తే
నీలమణిర్విభూషణమయం శంభో మహాత్మన్ వద ||
జ్వాలాభీల
సకరామరభయకారకమైన ఈ హాలాహాల విషమును పక్వజంబూఫలరీతిని (మాగిన నేరేడు పండు విధమున)
నీ కన్నుల గాంచుటయే గాక, చేతనెత్తి, నీ కొన్నాలిక యందుంచి, నీ కంఠసీమనందు
నిక్షిప్తము గావించుకొంటివి. అది నీకు ఒక సిద్ధగుళిక మాత్రముగనో లేక, నీలమణిచ్ఛందమునో
ఒప్పదగినదయ్యెను గదా శంభో! సర్వలోకభయాపహా, నీ లీలను విడమర్చి చెప్పుము.
ज्वालोग्रस्सकलामराति भयदः स्वेलः कथं वा त्वया
दृष्टः किं च करे दृतः करतले किं पक्वजम्बूफलम् |
जिह्वायां निहितश्च सिद्धगुटिका वा कंठदेशे भृतः
किं ते नीलमणिर्विभूषणमयं शम्भो महात्मन् वद ||
O
Shambho, the bestower of the benevolence on all the realms, how does the most
vicious venom by which the entire sect of immortals has been frightened, –
Halahala, has become a sight for you to behold and a ripe plum in your hands, a
medicinal lozenge on your tongue and shone as a blue sapphire in your neck.
Enlighten me my Lord, on this feat of yours.
SLOKA
-33:
నాలం వా సకృదేవ దేవ భవత్సేవా నతిర్వా
నుతిః
పూజ వా స్మరణం కథాశ్రవణమాప్యాలోకనం
మాదృశామ్ |
స్వామిన్నస్థిరదేవతానుసరణాయాసేన
కిం లభ్యతే
కా వా ముక్తిరితః కృతో
భవతి చేత్ కిం ప్రార్థనీయం తదా ||
క్షణమాత్రమైనా నా కాయకమైన
నమస్కారముచేతనో, నా మనస్సునందు నీచేతనో, నీ పూజధ్యానతత్పరత చేతనో, నీ
కథాశ్రవణసంకీర్తనవలననో, నీ నామస్మరణపునశ్చరణవిధులనో, నీ సేవ చెల్లించుకోగలిగితే
చాలదా ప్రభో, మాబోంట్లకు. అస్థిరమైన నిఖిలదేవతాసమూహమును ఆరాధించి ఆయాసమునొందుటయేగానీ,
తత్ఫలమేమి? దానిని పాటింపనావశ్యకత ఏమి? మోక్షము మరెందు గలదు ప్రభో, నీ భవ్యనామ
స్మరణశ్రవణసంకీర్తనములయందు గాకున్న?
नालं वा सकृदेव देव भवत्सेवा नतिर्वा नुतिः
पूजा वा स्मरणं कथाश्रवणमप्यालोकनं मादृशाम् |
स्वमिन्न्स्थिरदेवतानुसरणायासेन किं लभ्यते
का वा मुक्तिरितः कृतो भवति चेत् किं प्रर्थनीयनं तदा ||
Hey
Bhagavan! Even if it were to be an ephemeral second that passes by in your
thought, in your worship, in bowing to you, in the recitation of your name, in
the hearing of your stories and in the beholding of your acts – it is enough
for the sorts of us. What is it, if not fatigue – by going after all the puny
gods? What salvation is there if not here (in your worship) elsewhere? My Lord!
Sloka
– 34:
కిం బ్రూమస్తవ సాహసం
పశుపతే కస్యాస్తి శంభో భవ-
ద్ధైర్యం చేదృశమాత్మనః స్థితిరియం చాన్యైః కథం లభ్యతే
భ్రశ్యద్దేవగణం త్రసన్మునిగణం
నశ్యత్ప్రపంచం లయం
పశ్యన్నిర్భయ ఏక ఎవ
విహరాత్యానందసాంద్రో భవాన్
ఓ పశుపతే, ప్రభో నీ
సాహసము అనన్యసామాన్యము, అనితరసాధ్యము కదా, స్వక్రీడానందవిహారివగుచు నీవు దేవగణములు
పదభ్రష్టులగుదురేని, సమస్తమునిజనానీకము భయవిహ్వాలులగుదురేని, ప్రపంచము సర్వమూ
నశించి లయంబందునేని చూచుచూ నిర్భీతినానందస్వరూపుడవగుచు ఒక్కడివే ఉన్నావు. నీ
సహసధైర్యవిక్రమాలను వర్ణింప మావంటి వారికి సాధ్యమా?
తా: ఒక చిన్న
కుటుంబములోని ఒడిదుడుకులను తట్టుకోలేని మేము నీ చేతనావస్థయగు సమస్త ప్రాపంచికసమూహము
లయముబొందగా చూచి కూడా నిర్వికల్ప మానసుడవాగుచు ఆత్మానందస్థితీభూతుడవైన నీ
మహిమనెన్న మా తరమా?
किं ब्रूमस्तव साहसं पशुपते कस्यासति शम्भो भव-
द्धैर्यं चेदृशमात्मनः स्तिथिरियं चान्यैः कथं लभ्यते |
भ्रश्यद्देवगणं त्रसन्मुनिगणं नश्यत्प्रपञ्चं लयं
पश्यन्निर्भय एक एव विहरत्यानन्दसान्द्रो भवान् |
O
Pashupathi, the lord of the all beings, what can be said about your composure.
Having seen all the gods lose their lustre and all the saints tremble in fear
at the time of total annihilation, you maintain the state of calmness which is
unparalleled and cannot be attained by anyone else. Seeing all this alone, you
stay fearless and intensely joyful in your act.
Meaning:
My Lord, we are a very miniscule part of your creation and we are not able to
bear any trouble that might befall on our small families. How is it possible
for us to describe the composure of yours? You are the one that has created
this entire universe and moulded it into this conscious form and still bear to
see it destroyed with the same stoic attitude as you saw when it was created.
Sloka
– 35:
యోగక్షేమధురంధరస్య సకలః
శ్రేయః పదోధ్యోగినో
దృష్టాదృష్టమతోపదేశకృతినో
బాహ్యంతరవ్యాపినః |
సర్వజ్ఞస్య దయాకరస్య కిం
వేదితవ్యం మయా
శంభో, త్వం పరమాంతరంగ ఇతి
మే చిత్తే స్మరామ్యన్వహమ్ ||
యోగాక్షేమములను సమస్త
ప్రజలకు ఒసంగువాడవు, సకలమర్త్యామర్త్త్యగణంబులకు సముచిత శ్రేయోసంపదలను
గూర్చువాడవు, మానుషమైన దృష్టికి గోచరించునది, గోచరించనిదైన సమస్త
విస్వాన్తర్బహిస్వరూపుడవు, ఐహికాముష్మికమైన వివిధోపాయములను మాకెరిగించువాడవు,
సర్వత్ర నీవై ఉన్నవాడవు, సర్వులనూ దయతో చూచువాడవు, అయిన నీ గురించి ఇంతకంటే నేనేమి
తెలియగలవాడను ప్రభో, శంభో! సదాశివ, నీవొక్కడివే నాకాప్తుడవు, నా అంతరంగ సంవర్తివని
నిరంతరమూ నా మదియందు స్మరించెదను. ఇదొక్కటే నాకు శ్రేయఃకారకము.
योगक्षेमधुरन्धरस्य सकलः श्रेयः पदोध्योगिनो
दृष्टादृष्टमतोपदेशकृतिनो बाह्यन्तरव्यापिनः |
सर्वज्ञस्य दयाकरस्य किं वेदितव्यं मया
शम्भो, त्वं परमान्तरंग इति मे चित्ते स्मराम्यन्वाहम्
||
O
Shambho, Mahadevaa! You are the one that provides for the preservation of all
the beings. You are the one that can provide the humans and the immortals alike
with al that which is good for them, You are skilled in the art of preaching
directly and indirectly various ways of attaining the worldly and the
other-worldly means. You are the one that resides in all the creation which is
visible and invisible to our mundane eyes. O shambho! The ever pervading one,
what else can I learn about you, except that I recollect in my heart every
second that you are the real benefactor to me in deed and thought.
Sloka – 36:
భక్తో భక్తిగుణావృతే ముదమృతాపూర్ణే ప్రసన్నే మనః –
కుంభే సాంబ తవాంఘ్రిపల్లవయుగం సంస్థాప్య సంవిత్ఫలమ్ |
సత్త్వం మంత్రంముదీరయన్నిజశరీరాగారశుద్ధిం వహన్
పుణ్యాహం ప్రకటీకరోమి రుచిరం కళ్యాణమాపాదయన్ ||
ప్రభో, సాంబ, భక్తుడనైన నేను భక్తియనెడి
నూలుపోగులతో చుట్టి, ఆనందమనెడి అమృతముతో నింపి, స్వచ్చమైనదైన నా మనోకుంభమందు నీ
పాదములనెడి చిగురుమామిడాకులను కూర్చి, జ్ఞానంబను పూర్ణఫలమును స్థాపించి సత్వమనెడి
మంత్రమును ఉచ్చరించుచూ, నిజ శరీరమనెడి గృహమును పుణ్యాహమాచరించి కల్యాణమును సంపాదించెదను.
ప్రభో!
తాత్పర్యము: నీ భక్తిసూత్రములతో నా మనస్సును కట్టి, వేఱొక కోరికలేక, ఆనందామృతముతో
దానిని నింపుకుని, నీ పాదములనే ఆరాధించుచూ, జ్ఞానానందమయమైన జీవితమును గడుపుచూ నా ఈ
శరీరమును పునీతము చేసుకుంటాను ప్రభో. ఒక్కసారి పునీతమైన ఈ శరీరాన్ని నేను
ప్రవేశించకమునుపే నీచే ప్రవేశిమ్పచేసి ఆధ్యాత్మికాభౌతిక శరీరాన్ని చేరుకుంటాను
స్వామీ, సాంబా, మహాదేవా!
भक्तो भक्तिगुणावृते मुदमृतापूर्णे प्रसन्ने मनः –
कुम्भे साम्ब तवाङ्घ्रिपल्लवयुगं संस्थाप्य संवित्फलम्
|
सत्त्वं मन्त्रमुदीरयन्निजशरीरागारशुद्धिं वहन्
पुण्याहं प्रकटीकरोमि रुचिरं कल्याणमापादयन् ||
O
Prabho, Samba, I am your devotee seeking the most of auspiciousness, I will
perform the purification
ceremonies on my own body with a pure pitcher of mind filled with eternal joy,
threaded by the strings of your devotion, filled with the ambrosia of
happiness, placed in it are none other than your sacred feet as leaved and
wisdom as the fruit. Let my body be your dwelling my lord, before even I enter,
I beseech your entrance into it so I can attain an
immortal form of eternal joy and wisdom which is always clarified by the most
peaceful of prayers.
Sloka
37:
ఆమ్నాయంబుధిమాదరేణ
సుమనస్సంఘాస్సముద్యన్మనో
మంథానం
దృఢభక్తిరజ్జుసహితం కృత్వా మధిత్వా తతః |
సోమం
కల్పతరుం సుపర్వసురభిం చింతామణిం ధీమతాం
నిత్యానందసుధాం
నిరంతరరమాసౌభాగ్యమాతన్వతే ||
వేదాధ్యయనాసక్తులగుచూ,
విబుధశ్రేష్టులు తమ మనస్సు అను కవ్వమును దృఢమైనభక్తియనెడి త్రాటితో కట్టి వేదసాగారమును
మధించగా దానినుండి చంద్రకళాధరుడవు, ఉమాదేవితో కూడినట్టివాడివి, కల్పతరువు,
కామధేనువు, చింతామణి వంటి ఈప్సితార్థఫలప్రదాయకుడవు, నిత్యానందామృతమునొసగువాడవు,
నిరంతరసౌఖ్యమగు మోక్షప్రదాయకుడవునాగు నిన్ను పొందుచున్నారు ప్రభో, ఈశ్వరా!
आम्नायंबुधिमादरेण सुमनस्संघास्समुद्यन्मनो
मन्थानं दृढभक्तिरज्जुसहितं कृत्वा मधित्वा ततः |
सोमं कल्पतरुं सुपर्वसुरभिं चिन्तामणिं धीमतां
नित्यानन्दसुधां निरन्तररमासौभाग्यमातन्वते ||
My
lord, the group of scholars having made their inquisitive mind as the churning
stick and the firm devotion on you as the tightening rope, and having churned
the ocean of the Vedas , they reach none other than you, who is with Uma Devi,
who is like the wish yielding tree, the divine cow and the wish yielding gem of
Chintamani, who is the ambrosia oof eternal happiness and the blessedness of
eternal salvation.
ದೃಢಭಕ್ತಿ ಹಗ್ಗದಲಿ ಮನದ ಕಡೆಗೊಲನ್ನು ಬಿಗಿದು, ವೇದದ ಕಡಲ ಶ್ರದ್ಧೆಯಲಿ ಕಡೆದು, ಕಲ್ಪತರು,
ಸುರಭಿ, ಚಿಂತಾಮಣಿಗಳ ಸಮನಾಗಿರುವ ಸೋಮವು (ಸ-ಉಮಾ ಅಂದರೆ ಶಿವನು) ಅರಿತವರಿಗನುದಿನವು ಆನಂದ
ಕೊಡುವ, ಸುಧೆಯಂಥ, ನಿತ್ಯ ಸೌಭಾಗ್ಯಲಕ್ಷ್ಮಿಯ (ಮೋಕ್ಷವನ್ನು) ತರದ ನಿನ್ನ ಪಡೆವರು ವಿಬುದರು, ಹೇ
ಮಹಾದೇವಾ!
Sloka 38:
ప్రాక్పుణ్యాచలమార్గదర్శిసుధామూర్తిః ప్రసన్నశ్శివః
సోమస్సద్గణసేవితో మృగధరః పూర్ణస్తమోమోచకః |
చేతః పుష్కరలక్షితో భవతి చేదానందపాథోనిధిః
ప్రాగల్భ్యేన విజృంభతే సుమనసాం వృత్తిస్తదాజాయతే ||
అచంచలపూర్వకృతపుణ్యవిశేషము మార్గదర్శనముకాగా కన్పడునట్టి అమృతమూర్తి,
ప్రసన్నస్వచ్ఛవిగ్రహస్వరూపుడు, ఆనందమూర్తి, ఉమాసమేతుడు సద్గణములచేత నిరతమూ సేవింపబడువాడు,
మాయామృగధారి, పరిపూర్ణశబ్దవాచ్యుడు, షోడశకళాప్రపూర్ణుడు, తమస్సునుండి విమోచనము
గావిన్చువాడు. హృదయాకాశమునందు విచక్షణచేత మాత్రమే కన్పడునట్టివాడు అయిన ఆ
పరమశివుని కాంచినప్పుడు మనస్సునందు ఆనందసాగరము ఉప్పొంగుచున్నది. అట్టి అనుభవమైన
పుణ్యాత్ములకు అందు సదా ఓలలాడవలెనన్న ప్రకృతి సంభవించును కదా!
అన్యతాత్పర్యవిశేషము: పవిత్రమైన తూర్పు కొండలమధ్య ఉదయించువాడు, అమృతకిరణములుకలవాడు,
ప్రసన్నుడు, ఆనందదాయకుడు, చంద్రుడు, తారాగణములచేత సేవింపబడువాడు, జింకవంటి మచ్చను
తనపై కలవాడు, అంధకారమును తొలగించువాడు, మనస్సుకు ఆనందము కలిగించువాడు, సాగరములు
ఉప్పొంగజేయువాడు అయిన పూర్ణచంద్రుడు కనపడగా మనస్సు ఆనంద పారవశ్యమున ఓలలాడవలెనన్న
కోరిక రసికులకు కలుగుచున్నది కదా!
प्राक्पुण्याचलमार्गदर्शिसुधामूर्तिः
प्रसन्नश्शिवः
सोमस्सद्गणसेवितो मृगधरः
पूर्णस्तमोमोचकः |
चेतःपुष्करलक्षितो
भवतिचेदानन्दपाथोनिधिः
प्रागल्भ्येन विजृम्भते सुमनसां
वृत्तिस्तदाजायते ||
By the path shown by
virtue of unparalleled devotion and good deeds in the past, appears the
personification of ambrosia, the most benevolent and ever blissful, the one
with Godess Umadevi and served always by the righteous, handling a myriad-like
deer, one who is complete with all the 16 extolled virtues ascribed for the Gods,
the remover of darkness in the heart and who can only be seen with a serene
mind and by extreme devotion and virtue of the seeker, the mighty Lord Shiva –
when he is seen the heart is enthralled in an ecstasy and seeks to sway in that
blissful ocean of eternal happiness.
Another meaning: One who
rises in the sacred eastern hills, whose rays are made from ambrosia, who is
serene and delightful for the beholder, one who is called by the name Soma, who
is served by all the good constellations in the sky, who has the mark of a deer
on him who drives the darkness away with his light, who provides bliss to the
mind, by whom are all the oceans rise, the full moon – as he rises on the
horizon, the mind is filled with a pleasant feeling and wishes to sway in that
ocean of relaxation.
Sloka 39:
ధర్మో మే చతురంఘ్రికస్సుచరితః పాపం వినాశం గతమ్
కామక్రోధమదాదయో విగలితాః కాలాః సుఖావిష్కృతాః |
జ్ఞానానందమహౌషధిస్సుఫలితాః కైవల్యనాథే సదా
మాన్యే మానసపుండరీకనగరే రాజావతంసే స్థితే ||
సకలరాజశ్రేష్టుడును, చంద్రశిరోమణిభూషితాంగుడు, మాన్యుడు అగు పరమేశ్వరుడు నా
మనస్సరోజమునందు సుఖోపస్థితుడు కాగా, ధర్మము నాలుగు పాదములపై నడువసాగెను, పాపమూ
పూర్తిగా నశించెను, కామా, క్రోధ, మద మోహాది అరిషడ్వర్గములు పూర్తిగా తొలగింపబడినవి
అయ్యెను. పక్ష మాస సంవత్సారాయనములు పూర్తీగా ప్రకటీభూతులయ్యెను, జ్ఞానము తత్సంపాదితానందము
అనెడి మహౌషధవృక్షములు చక్కగా ఫలించెను.
धर्मो मे चतुरङ्घ्रिस्सुचरितः पापं विनाशं गतं
कामक्रोधमदादयो विगलिताः कालाः सुखाविष्क्रुताः |
ज्ञानन्दमहौशधिस्सुफलिताः कैवल्यनाथे सदा
मान्ये मानसपुण्डरीकनगरे राजावतंसे स्थिते ||
As
the lord of salvation and the one who was always extolled by the eternal hymns
occupied the high seat in the city of my lotus heart, truth prevailed and
justice sprang on all its four limbs, all the sins were extirpated, the vices
like lust, anger, pride were destroyed. All the four seasons fared well. The
pious plants of wisdom and a sprout of it the eternal happiness were in full
bloom yielding their natural fruit in bounty.
Sloka – 40:
ధీయంత్రేణ వచోఘటేన కవితాకుల్యోపకుల్యాక్రమై-
రానీతైశ్చ సదాశివస్య చరితాంభోరాశిదివ్యామృతైః |
హృత్కేదారయుతాశ్చ భక్తికలమాః సాఫల్యమాతన్వతే
దుర్భిక్షాన్మమ సేవకస్య భగవన్విశ్వేశ భీతిః కుతః ||
హే భగవాన్, విశ్వనాథ! బుద్ధియనెడియంత్రముచేత, వాక్కులనెడికుండలచేత, కవితయనెడి
సరస్సులు, ఉపసరస్సులచేత కొనిరాబడిన సదాశివుని చరితమనెడి అంభోరాశి యొక్క
దివ్యామృతతుల్యమైన నీటితో నా మనస్సను క్షేత్రములయందు భక్తి మొలకలెత్తించి ఆ ఫలమును
గొనువాడ, క్షామమను భీతి నీ సేవకుడనైన నాకెందువల్ల రావలెను ప్రభో.
धीयन्त्रेण वचोघटेन कविताकुल्योपकुल्याक्रमै-
रानीतैश्च सदाशिवस्य चरितांभोराशिदिव्यामृतैः |
हृत्केदारयुताश्च भक्तिकलमाः साफल्यमातन्वते
दुर्भिक्षान्मम सेवकस्य भगवान्विश्वेश भीतिः कुतः ||
Hey
Bhagavan, Vishwanatha, The holy sagas of yours as mighty as ocean are they –
are brought into the ponds and lakes of my poetry through the verses of speech
powered by the mechanism of of ever prevailing thought of yours. As they keep
flowing into the fields of my mind and helping to spring the sprouts of
devotion on you, I humbly relish on its produce. How can a drought threaten me
my Lord, with such an eternal supply of your divine stories keep fertilising
the fields of my mind.
Sloka
– 41:
పాపోత్పాతవిమోచనాయ రుచిరైశ్వర్యాయ మృత్యుంజయాయ
స్తోత్రధ్యాననతిప్రదక్షిణ సపర్యాలోకనాకర్ణనే
|
జిహ్వాచిత్తశిరోఙ్ఘ్రిహస్తనయనశ్రోత్రైరహం
ప్రార్థితో
మామాజ్ఞాపయ తన్నిరూపయ ముహూర్మామేవ మామేవ చ
||
ప్రభో, మృత్యుంజయా! సకలపాపములను బాసి, శాశ్వతమైన
మోక్షమనెడి ఐశ్వర్యమును పొందుటకు, ఈ జననమరణ చక్రభ్రమణమునుండి విడిపడుటకు, నీ
స్తోత్రము, ధ్యానము, నమస్కారము, ప్రదక్షిణము, నీకు సపర్య, నీ దివ్యమంగళరూప
దర్శనార్థమునకై నా జిహ్వా(నాలుక), చిత్తము (మనస్సు), శిరస్సు, కరచరణములు, కన్నులు,
కర్ణద్వయము నన్ను పదే పదే ప్రార్థించుచున్నవి. ప్రభో, నను నీ అజ్ఞాబద్దుడను చేసి,
నీ సపర్యలకై పురిగొల్పుకొనుము (నన్ను నీవాడిగా చేసుకుని, నీ కార్యక్రమములకై
వినియోగించుకొనుము). సదా సర్వదా నిన్ను మరల మరలా వేడుకొనుచున్నాను. నాకు
మూకత్వమును (పామరత్వమును – నీ సేవాభాగ్యము లేకుండగా) చేయకుము.
पापोत्पातविमोचनाय रुचिरैश्वर्याय
मृत्युञ्जयाय
स्तोत्रध्याननतिप्रदक्षिणासपर्यालोकानाकर्णने
|
जिह्वाचित्तशिरोन्घ्रिहस्तनयनश्रोत्रैरहं
प्रार्थोतो
मामाज्ञापय तन्निरूपय मुहुर्मामेव
मामेव च ||
My Lord, to extricate from
the shackles of all sins and to attain the eternal opulence of salvation, and
to cross the circle of life and death, my Lord, Mruthyunjaya – who has conquered
death – to extol you with hymns, to ponder on your divine thoughts, to
prostrate only to you, to perform the sacred circumambulation to you, to
worship you, to behold on you and to listen to your holy hymns, all my senses, my
tongue, my mind, soul and heart, my head, my limbs, my ears and eyes have been
begging me. (Every part of me is longing to be of service to you). Please
anoint me for your worship and as your servant, please spare my words, my lord and
do not dispossess me of my speech - so I am rendered useless to be of service
to you.
Sloka – 42:
గాంభీర్యం
పరిఖాపదం ఘనధృతిః ప్రాకార ఉద్యద్గుణ
స్తోమశ్చాప్తబలం
ఘనేంద్రియచయోద్వారాణి దేహస్థితః |
విద్యావస్తుసమృద్ధిరిత్యఖిలసామగ్రీసమేతే
సదా
దుర్గాతిప్రియదేవ
మామకమనోదుర్గే నివాసం కురు ||
ఓ
కైలాసవాసా, ఈశ్వరా, నీవు దుర్గాప్రియుడవు, అతికఠినమైన కైలాసపర్వతమునందు మిగుల
ప్రీతితో వసించువాడవు. గాంభీర్యమను అగడ్తగల్గినది, ధైర్యము ప్రాకారముగా కలిగినది.
సద్యోదయగుణములు ఆలవాలములుగా, సైన్యముగా కల్గినది, నా ఇంద్రియపంచకమే ద్వారములుగా
కలిగినది, పరమశివజ్ఞాననామశ్రవణసంకీర్తనాది వస్తుసముచ్చయము సమృద్ధిగా గలది
అయినట్టిదైన నా దేహమును నీ ఆవాసముగా చేసుకొనుము. ఇట్టి దుర్గాలక్షణములు సమృద్ధిగా
గలది అయిన నా దేహమునందు నీవు వసింపుము ప్రభో!
गाम्भीर्यं परिखापदं घनधृतिः प्राकार उद्यद्गुण
स्तोमश्चाप्तबलं घनेन्द्रियचयोद्वाराणि देहस्थितः
विद्यावस्तुसमृद्धिरित्यखिलसामग्रीसमेते सदा
दुर्गातिप्रियदेव मामकमनोदुर्गे निवासं कुरु ||
Hey Kailasavasa, Eeswara, You
are the lover of the Goddess Durgadevi (Durga also means fortress). As you
always reside in the heart of the Durgadevi, dwell in my heart as well, where
the profundity of character is the moat, my courage is the rampart, the
assemblage of the virtues is the most trustworthy army, the multitude of my
senses as the doors - with you fully knowing that the abundance of materials
and thus endowed with all the provisions. Be it that you and the mother Durga –
the eternal duo, reside in my heart and I shall enjoy the bliss of serving you forever.
Sloka – 43:
మాగచ్ఛస్త్వమితస్తతో
గిరిశ భో మయ్యేవ వాసం కురు
స్వామిన్నాదికిరాత
మామకమనః కాంతారసీమాంతరే |
వర్తన్తే
బహుశో మృగా మదజుషో మాత్సర్యమోహాదయ
స్తాన్
హత్వా మృగయావినోద రుచితాలాభం చ సంప్రాప్యసి ||
ప్రభో,
దేవా! నీవు ఆదికిరాతుడవు, అందిందుబోక నామనస్సునందే స్థిరనివ్వాసము ఏర్పరచుకొనుము.
పర్వతాగ్రవాసా, శివా! నా మనస్సు అను అడవి మెండుగా బలిసిన కామక్రోధమదమాత్సర్యాది
వన్యమృగములచే నిండి ఉన్నది. వాటిని సంహరించి నీ మృగయావినోదమును (వేటయందలి ప్రీతిని)
ఇక్కడనే పొందగలవాడవు.
मा गच्छस्त्वमितसततो गिरिश भो मय्येव वासं कुरु
स्वामिन्नदिकिरात मामकमनः कान्तारसीमान्तरे |
वर्तन्ते बहुशो म्रुगा मदजुशो मात्सर्यमोहादय
शतान् हत्वा मृगयाविनोद रुचितालाभं च संप्राप्यसि ||
My
Lord, You are the primal hunter, Why do you need to go here and there in vain
when you can find all the pleasure you need within me. Make my heart and soul
your eternal dwelling place. O, the dweller of the mountains, Shiva, in here
are the infamous animals anger, lust, greed, pride et cetera. You can kill
those strong beasts and satiate your craving for hunting.
Sloka
– 44:
కరలగ్నమృగః
కరీంద్రభంగో
ఘనశార్దూలవిఖండనోస్తజన్తుః
|
గిరిశో
విశదాకృతిశ్చ చేతః
కుహరే
పంచముఖోస్తి మే కుతో భీః ||
పర్వతాగ్రశయనా,
ఈశ్వరా! చేతియందు జింకను కలవాడవగుచూ, దంతిసమూహమును దండించుచూ, బెబ్బులులను సైతము
త్రుంచగల్గినవాడవు, విశద ధవళాకృతిచేత నొప్పుచూ, సమస్తప్రాణిసంఘమును లోనికి
గొనుచున్న పంచముఖములు కల్గిన సింహమువంటి నీవు నా మనః కుహరమునందు వేంచేసియుండ నాకు
భయము దేనిచేత గల్గునయ్యా?
करलग्नमृगः करीन्द्रभङ्गो
घनशार्दूलविखण्डनोस्तजन्तुः |
गिरिशो विशदाकृतिश्च चेतः
कुहरे पञ्चमुखोस्ति मे कुतो भीः ||
O
mountain dweller, My Lord Shiva, Who holds in a hand a deer and also capable of
destroying elephants, you are the annihilator of violent lions and tigers and
into whose form all animals vanish, who has the white bright form shining in
all glory with five faces. If such a lion dwells in the cave of my heart, what
else can be the cause of fear for me?
Sloka
– 45:
ఛందశ్శాఖిశిఖాన్వితైర్ద్విజవరై
స్సంసేవితే శాశ్వతే
సౌఖ్యాపాదిని
ఖేదభేదిని సుధాసారైః ఫలైర్దీపితే |
చేతః
పక్షిశిఖామణే త్యజ వృథా సంచారమన్యైరలం
నిత్యం
శంకరపాదపద్మయుగళీ నీడే విహారం కురు ||
ఓ,
నా మనస్సనెడి పక్షిరాజమా! వేదోపాన్గములు, ఉపనిషత్తులు అను శాఖలు కలిగి, బ్రాహ్మణశ్రేష్టులనెడి
పక్షులచేత శాశ్వతముగా సేవింపబడునట్టిది, పరమసౌఖ్యప్రదాయిని, సమస్త దుఃఖములను
తొలగించునది, అమృతములూరు రసవంతములైన ఫలములచే దీపించునది అయిన శంకరుని
పాదపద్మయుగళము అను గూటిని ఆశ్రయించుము. వృథా ప్రయాసలు కలుగజేయు సంచారమును మానుము.
छन्दश्शाखिशिखान्वितैर्द्विजवरै स्संसेविते शश्वते
सौख्यापादिनि खेदभेदिनि सुधासारैः फलैर्दीपिते |
चेतः पक्षिशिखामणे त्यज वृथा संचारमन्यैरलं
नित्यं शङ्करपादपद्मयुगळी नीडे विहारं कुरु ||
O,
the bird of my heart! Give up your roaming that is vain. Make it your dwelling
the nest of the pair of Shankara’s lotus feet, the tree which has the Vedas as
branches and the Upanishads as the tree tops, which is well worshipped by the
birds of Brahmins, which is eternal and yields the fruits of ambrosia which
cause all the happiness and removes all the pain.
Sloka
– 46:
ఆకీర్ణే
నఖరాజికాంతివిభవైరుద్యత్సుధావైభవై
రాధౌతేపి
చ పద్మరాగలలితే హంసవ్రజైరాశ్రితే |
నిత్యం
భక్తివధూగణైశ్చ రహసి స్వేచ్ఛావిహారం కురు
స్థిత్వా
మానసరాజహంస గిరిజానాథాంఘ్రిసౌధాంతరే ||
తెల్లని
కాలిగోటివరుసలనుండి ఉద్భవించుచున్న కాంతిపుంజముల దివ్యవైభవముతో అలరారుతూ, దినదినప్రవర్ధమానములగు
అమృతతుల్య చంద్రమయూఖములు ఆ నఖరాజములయందు ప్రతిఫలింపగా, ఆ కాలిగోటి మొదలులు స్వచ్చమైన
ఎఱ్ఱని పద్మరాగశిలామణులవలే సొబగులీనుతూ ఉన్న గిరిజానాథుని పాదపద్మయుగళమును
ఆశ్రయించి, ఓ, నా మానసరాజహంసమా! భక్తియను కాంతలను గూడి స్వేచ్చగా విహరింపుము. ఏ
పాదములను చేరగోరి పరమహంసలు, సాధుపుంగవులు నిత్యమూ హంసగాయత్ర్యాది మంత్రములచేత
ఆరాధించెదరో, ఆ పాదపద్మభవనమునందు నీవు వేఱొండు కోరికలేక వసింపుము.
आकीर्णे नखाराजिकान्तिविभवैरुद्यत्सुधावैभवै
रधौतेपि च पद्मरागललिते हंसव्रजैराश्रिते |
नित्यं भक्तिवधूगणैश्च रहसि स्वेच्छाविहारं कुरु
स्थित्वा मानसराजहंस गिरिजानाथांघ्रिसौधान्तरे ||
O,
the royal swan of my heart, Flirt wih freedom with your wives of devotion in
the mansion of Lord Girijanatha’s lotus feet, whose toes are adorned with while
nails emanating lustre and glistening in the sweet moonlight that progresses
day by day. Those, whose cuticles shine like rubies in that fair moonlight.
Those that are ever exalted by the saints and preachers with the most sacred of
the hymns. Let them b the grange for you, where you can stay with unhindered
will.
Sloka
– 47
శంభుధ్యానవసంతసంగిని
హృదారామేఽఘజీర్ణచ్ఛదా
స్రస్తా
భక్తిలతచ్ఛటా విలసితాః పుణ్యప్రవాళశ్రితాః |
దీప్యంతే
గుణకోరకా జపవచః పుష్పాణి సద్వాసనా
జ్ఞానానందసుధామరందలహరీ
సంవిత్ఫలాభ్యున్నతీ ||
శంభో,
ఈశ్వరా! నీ ధ్యానమను వసంతసమయము నా హృదయమునందు ప్రవేశించినంతనే, పాపములను
పండుటాకులు రాలిపడిపోయినవి. భక్తి అను తీగలు గుంపులు గుంపులుగా ఎగబ్రాకినవి.
వాటిని ఆశ్రయించి పుణ్యమను చిగురుటాకులు మొలకెత్తినవి. సద్గుణములు అనెడి మొగ్గలు
బయల్వెడలినవి. సత్కర్మసంస్కారములనే సువాసనగలిగి జపవాక్యములను పుష్పములు పూచినవి.
వీటన్నింటిద్వారా జ్ఞానానందమనే మధువులూరు బ్రహ్మజ్ఞానఫలము పండి దినదినప్రవర్ధమానమగుచున్నది.
शंभुध्यानवसन्तसंगिनि हृदारामेऽघजीर्णच्छदा
स्रस्ता भक्तिलतच्छटा विलसिताः पुण्यप्रवालश्रिताः|
दीप्यन्ते गुणकोरका जपवचः पुष्पाणि सद्वासना
ज्ञानानन्दसुधामरन्दलहरी संवित्फलाभ्युन्नती ||
Hey
Shambho, as my mind strode into the spring of your contemplation, the dried
leaves of sinof the tree of my heart are shed, the creepers of devotion rose,
from them sprang the twigs of purity, which gave way to the buds of virtues.
Good deeds and great merits are the scent of the flowers of penance that
bloomed. With all of these the knowledge of Brahman is the fruit yielded oozing
the ambrosia of eternal happiness ripening day by day.
Sloka
- 48:
నిత్యానందరసాలయం
సురమునిస్వాంతాంబుజాతాశ్రయం
స్వచ్ఛం
సద్విజసేవితం కలుషహృత్సద్వాసనావిష్కృతమ్ |
శంభుధ్యానసరోవరం
వ్రజ మనోహంసావతంస స్థిరం
కిం
క్షుద్రాశ్రయపల్వలభ్రమణసంజాతాశ్రమం ప్రాప్యసి ||
ఓ
మానసరాజహంసమా! శాశ్వతమైన ఆనందమునకు ఉనికిపట్టును, దేవమునిగణానీకముల హృదయపద్మములకు
ఆధారభూతము, స్వచ్ఛము, యోగ్యులైన
బ్రాహ్మణులచే సదా సేవితము, సర్వపాపహారము, సత్కర్మవాసనలచే ఆవిష్కృతము, శంభునిధ్యానమను
సరోవరమును, ఆశ్రయించి స్థిరనివాసమేర్పరుచుకొనుము. క్షుద్రులను ఆశ్రయించి, బురదయందు
పరిభ్రమించు వలన కలుగు ఆయాసమేల పొందెదవు.
नित्यानन्दरसालयं सुरमुनिस्वान्ताम्बुजाताश्रितं
स्वच्छं सद्विजसेवितं कलुषहृतसद्वासनाविष्क्रुतम् |
शंभुध्यानसरोवरं व्रज मनोहंसावतंस स्थिरं
किं क्षुद्राश्रयपल्वलभ्रमणसंजाताश्रमं प्राप्यसि ||
O the royal swan of my heart! Let that be your permanent residence,
the lake of contemplation on Lord Shambhu, that which is the source of all the
everlasting bliss, which is adorned by the lotus hearts of gods and saints
alike, which is pristine, and the waters of which are considered sacred by the
most reverred of the Brahmins, which extricates you from all the sins and
propogates the inner sanctity of your heart. Why do you crave for the puny gods
and exert yourself in vain when all you get by serving them is a minuscule puddle
of water?
Sloka - 49
ఆనందామృతపూరితా
హరపదాంభోజాలవాలోద్యతా
స్థైర్యోపఘ్నముపేత్య
భక్తిలతికా శాఖోపశాఖాన్వితా |
ఉచ్చైర్మానసకాయమనపటలీమాక్రమ్య
నిష్కల్మషా
నిత్యాభీష్టఫలప్రదా
భవతు మే సత్కర్మసంవర్ధితా ||
ఆనందమనే
అమృతముతో నిండినది, ఈశ్వరపదపద్మములు అనే
పాదు నుండి ఉద్భవించినది. ధైర్యము అనే ప్రాకును పొంది అల్లుకొనిపోవుచున్న నా భక్తి
అనే లత శాఖోపశాఖలుగా విస్తరించి అత్యున్నతమైన మానసిక స్థితిని పొంది కూడా
నిష్కల్మషముగా ఉన్నది. నిత్యమూ నేను కోరు (భక్తియను) ఫలములను నాకు
ప్రసాదించునట్టిది. పురాకృత సత్కర్మలచేత వృద్ధిపొందింపబడినది అగుగాక.
आनन्दामृतपूरिता हरपदाम्भोजालवालोध्यता
स्थैर्योपघ्नमुपेत्य भक्तिलतिका शाखोपशाखान्विता |
उच्चैर्मानसकायमानपटलीमाक्रम्य निष्कल्मषा
नित्याभीष्टफलप्रदा भवतु मे सत्कर्मसंवर्धिता ||
May the creeper of bhakti always be the yielder
of the fruit of lieration which is filled it ambrosia of happiness rising from
the branch of the lotus feet of Lord Shiva (Lord Hara), firm from the desire of
my mind and spread over to the heights with its branches and sub-branches and
still resistant to all ths sin, reared by the good deeds that I have previously
done and currecntly been doing.
Sloka - 50:
సంధ్యారంభవిజృంభితం
శృతిస్థిరస్థానాంతరాధిష్టితం
సప్రేమభ్రమరాభిరామమసకృత్
సద్వాసనాశోభితమ్ |
భోగాంద్రాభరణం
సమస్తసుమనఃపూజ్యం గుణావిష్కృతం
సేవే
శ్రీగిరిమల్లికార్జునమహాలింగం శివాలింగితమ్ ||
సంధ్యాకాలమందు
తాండవనృత్యకేళితో విజృంభించువాడును (సంధ్యాసమయమునందు వికాసించునట్టిదియును),
వేదములకు శిరస్సులనంబడు ఉపనిషత్తుల అంతర్గత
సారమైనవాడును (చెవులయందు, శిరస్సునందు అలంకరింపబడునట్టిది), ప్రేమతో ఎల్లప్పుడునూ
భ్రమరాంబికాదేవిఁ గూడి అలరారువాడును (తుమ్మెదల సమూహముచేతనెల్లపుడునూ ప్రేమించబడునట్టిది),
సాదుపుంగవులచేత సదా నిర్మలభావనలచేత స్మరింపబడువాడును (మంచివాసనచేత శోభించునట్టిది),
వాసుకి అనే మహానాగామును ఆభరణముగా నొప్పువాడును (రసికులచేత ధరింపబడునట్టిది), మంచి
మనస్సుగల సమస్తజనులకూ పూజనీయుడు (సర్వదేవతా పూజార్చనకు అర్హమైనట్టిది) సద్గునములను
వెలికితెచ్చువాడును (సుగంధాది గునములచేత భాసిల్లునది) అయిన శ్రీశైలమల్లికార్జున
లింగమును, ఈశ్వరిచేత ఆలింగింపబడిన లింగమును సేవించుచున్నాను.
संध्यारम्भविज्रुम्भितं श्रुतिस्थिरस्थानान्तराधिष्टितं
सप्रेमभ्रमराबिराममसकृत् सद्वासनाशोभितं |
भोगीन्द्राभरणं समस्तसुमनःपूज्यं गुणाविष्क्रुतं
सेवे स्रीगिरिमल्लिकार्जुनमहालिङ्गं शिवालिङ्गितम् ||
I worship the Lord in his
linga swaroopa as Srisaila Mallikarjuna (Mallikaarjuna means a jasmine creeped up supported by the trunk
of Arjuna tree (Terminalia arjuna), the linga which is in an ardent embrace by Goddess Bhramarambika Devi
also known as “Shivaa”
Acharya below described the linga as follows acribing the elements of
the linga to a jasmine flower – a technique known as paronomasia.
He, who is fiercely dancing during the twillight (That, which is fragrant
during the evening), the head of the vedas are called the upanishads and He,
who is the essence of all these knowledge (which is adorned on the ears and the
head). Who is always in deep love with Goddess Bhramarambika Devi (Which is
always aspired by the groups of honey-bees in search of honey), who is reverred
and worshipped by the saints and gods through their purest of thoughts (which
exudes the pleasant of the smells), who adorns the great serpant Vasuki (which
is most wanted by the connoiseurs), who is worshipped and extolled by all with
clear mind and thought (which is eligible to be offered in worship for all the
gods), who excavates the good qualities in a person (which is aways fragrant and
emanates a pleasant odour)
I worship you My Lord, with such flowers which have imbibed your
qualities by virtue of staying here with you in this forests (Srisailam is in a
very dense forest where the one of the twelve Jyotirlingas of Lord Shiva is
present along with one of the eighteen Shaktipeetas of Goddess Parvati Devi).
Sloka- 51:
భృంగీచ్ఛానతనోత్కటః
కరిమదగ్రాహీ స్ఫురన్మాధవా-
హ్లాదో
నాదయుతో మహాసితవపుః పంచేషుణా చాధృతః |
సత్పక్షస్సుమనోవనేషు
స పునః సాక్షాన్మదీయే మనో
రాజీవే
భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభుః ||
ఈ
శ్లోకమునందు ఆచార్యులు తుమ్మెదకూ స్వామికి సామ్యమును ఆపాదించుచున్నారు.
(౧)ఆడుతుమ్మెద
నాట్యమునందు అనురక్తి కలిగినట్టిది అయిన పోతుతుమ్మెద, (౨)ఇష్టముగా ఏనుగుల గండస్థలముల
నుండి ఉద్భవించు మదజలములు గ్రోలుట యందు అత్యంత ఆసక్తి కలిగినది, (౩)మధువులూరు తేనెపట్టులు
స్ఫురణకు వచ్చినప్పుడు మదియందు ఆహ్లాదము పొందునది, (౪)చిక్కని నలుపైన శరీరము గలది,
(౫) పంచబాణుడు – మన్మధుని చేత ధరింపబడినది. (మన్మథుని వింటినారి తుమ్మెదల సమూహము
అని లోక ప్రతీతి). (౬)సుమనోహరమైన ఱెక్కలు కలిగినది, (౭)రమణీయ వనములయందు సంచారము
చేయునది. (౮)నిత్యనూతనముగా కన్పడునట్టిది (౧౦) ఆడుతుమ్మెదకు మగడైనట్టి అయిన పోతుతుమ్మెద
సామ్యము కలిగిన వాడు, (౧) భృంగియను ప్రమథగణముల
అధినాయకుని నాట్యమునకు మనస్సు రంజించువాడు, (౨) మదించిన ఏనుగును (గజాసురుని)
సంహరించినవాడు, (౩) మాధవుడు-విష్ణువును నిరంతరమూ మదియందు తలచి ఆహ్లాదమునొందువాడు (హరిహరులు
తమను తాము పరస్పరమూ స్మరించుకొంటూ ఉంటారని యోగనిద్రలో ఒకరి ధ్యానములో ఒకరు ఉంటారని
పెద్దల అభిప్రాయము), (౪) తెల్లని సుందరమైన ఆకృతి కలవాడునూ, (౫) పంచబాణుడు –
మన్మధుని చేత నిత్యమూ ఆరాధింపబడువాడునూ, (౬) సుమనస్కులైన దేవ, యక్ష, రాక్షస,
మనుష్యాది సమస్త జీవజాల సమూహమూ తన ఇరువైపులయందు కలవాడునూ, సత్పురుషుల మనస్సునందు
నిరంతరమూ తన ధ్యాన జపములచేత సంచారము చేయువాడునూ, (౭) నిత్యనూతనుడునూ (౧౦) శ్రీభ్రమరాంబికాదేవికి
మగడు అయినట్టి శ్రీశైలవాసుడు అయినట్టి శ్రీమల్లికార్జున స్వామి సదా నా హృత్సరోజమునందు
విహరించుగాక
भृङ्गीच्छानटनोतकटः करिमदग्राही स्फुरन्माधवा-
ह्लादो नादयुतो महासितवपुः पञ्चेषुणा चा धृतः |
सत्पक्षस्सुमनोवनेषु स पुनः साक्षान्मदीये मनो
राजीवे भ्रमराधिपो विहरतां श्रीशैलवासी विभुः ||
Let the eternal duo of
Goddess Sri Bhramarambika Devi and God Sri Mallikarjuna dwell in the lotus of
my heart.
Acharya compares the
honey-bee here with the duo of Parvati and Parameshwara. As Lord Shiva is
pleased with the dance of Bhringi, the male honey-be is attracted by the dance
of the female bee. Adept is Lord Shiva in demolishing the dmon of Gajasura and
so is the honey-bee adept in savouring the Madhu secreted from the elephants’ temples
when they are in must. As the Lord Vishnu is pondered upon by Lord Shiva is
immensely pleased, the bee is pleased by the thought of honey itself. Lord
Shiva is the one that will always be accompanied by the primal sound of Pranava
(Omkara) and similarly the bee is always associated with the sound emanating
from its buzzing. Lord Shiva has a clear form enhanced with utterly fair
complexion. The bee is similarly a black complexion all over its body. The Lord
is honoured by Cupid and similarly the bee is also honoured by the Cupid, the
god of love (It is said that the bow-string of Cupid is made by a line of honey
bees. Lord Shiva is always surrounded by the greatest of the saints and gods
whereas the bee has beautiful wings flanking its body. Lord Shiva is the
resident of the forest filled with the greatest minds and the bee is in the
forest filled with the beautiful aroma exuded from the plants and the trees,
both always are anew.
If a honey bee is always
wanting to reside in a lotus with its female, My Lord, Shambho! Dwell in my
heart as well that has all the qualities of a lotus along with the Goddess Sri
Bhramarambika Devi.
Sloka-52:
కారుణ్యామృతవర్షిణం
ఘనవిపద్గ్రీష్మచ్ఛదాకర్మఠం
విద్యాసస్యఫలోదయాయ
సుమనస్సంసేవ్యమిచ్ఛాకృతిం |
నృత్యద్భక్తమయూరమద్రినిలయం
చంచజ్జటామండలం
శంభో
వాంఛతి నీలకంధర సదా త్వాం మే మనశ్చాతాకః ||
ఈ
శ్లోకమునందు ఆచార్యులు మేఘమునకూ స్వామికి సామ్యమును ఆపాదించుచున్నారు.
ఓ
(౧)నల్లని మేఘమా, (౨)సుఖకరమైనది, (౩)కరుణతో వర్షమను అమృతమును కురిపింపజేయునది, (౪)ఎండాకాలమున
కలుగు తాపమును ఉపశమింపజేయునది, (౫)సమస్తసస్యములు (పంటలు) బాగా వికసించి పండుటకు సహకరించునది,
వాటి ఉదయమునకు ఆధారభూతమైనట్టిది. (౬)కర్షకులు, మంచిమనసు కలవారికి ఆనందము కలిగించి
వారిచేత ఆరాధింపబడునట్టిది. (౭)కొండలు నెలవులుగా కలిగినట్టి నెమళ్ళచేత భక్తిగా
నర్తింపచేయునట్టిది. (౮)కదులుతున్న మెరుపుల సమూహము కలిగినట్టిది అయిన నిన్ను ఏ
విధముగా జనులు కోరి సేవించుచున్నారో అదే విధముగా నీలోని గుణములు అన్నీ రూపాంతరము
చెంది (౧) నీలమైన కంఠము కలవాడునూ, (౨) సమస్త సుఖములనూ కలగజేయువాడునూ (౩) అతి ఘోరమైన
ఆపదలనుండి కూడా రక్షించి ప్రశాంతత కలిగించువాడునూ, (౪) సద్విద్య అను సస్యము ఫలించి
భక్తులకు దాని ఫలితములను ఒసంగువాడునూ, (౫)దేవతలు, ఋషులూ, మఱియు సత్పురుషులచేత
నిత్యమూ ఆరాధింపబడువాడునూ, (౬) నెమళ్ళవలె నర్తించు ప్రమథభక్త గణములచే నొప్పారుహిమశైలమందు
నివసించువాడునూ, (౭) నిత్యమూ ఆనందతాండవకేళీలోలుడగుచూ కదులుతున్న జటాజూటమును కలిగినట్టివాడునూ,
అయిన పరమేశ్వరుని నా మనస్సు అను చాతకము నిత్యమూ సేవించుగాక (చాతక పక్షి ఏవిధముగా
అయితే మేఘోద్భూత అపతిత అంభోకణములు సేవించను ఆసక్తి కలిగి ఉంటుందో అదే విధముగా నేను
కూడా నిత్యమూ శంకరపాదపద్మధ్యానమును మాత్రమే చేయుదునని శ్రీఅదిశంకరభాగావద్పాదాచార్యుల
వారి భావన)
कारुण्यामृतवर्षिणं घनविपद्ग्रीष्मच्छदाकर्मठं
विद्यासस्यफलोदयाय सुमनस्संसेव्यमिच्छाकृतिं |
नृत्यत्भक्तमयूरमद्रीनिलयं चञ्चज्जटामण्डलं
शम्भो वाञ्छति नीलकन्धरसदा त्वां मे मनश्चातकः ||
On Lord Shiva: By
paronomasia this can be applied to a cloud also:
Hey Lord, Shambho! You are the one with a neck darkened by the
bluish hue of the poison in it. You are the one that bestows all happiness on
the earthly beings, the one, who is adept in removing the obstacles (that are
considered irremovable) from the ways of your devotees. For the sake of
evolution of proper knowledge in me, the bird of my heart prays to you as you
are the one that is prayed to by the saints and gods alike and has numerous
devotees filling the sacred mountains you reside in, and as you are the one
indulged in your blissful cosmic dance when the locks of your matted hair sways
beautifully.
On cloud:
O cloud! You are dark in
appearance and grace upon the land with rains the waters of which are as good
as ambrosia for the crops and saves people from the grave heat of the summer,
you are the one most wanted and honoured by the fair-minded and presents a pleasant
appearance to them. You are a boon to the crops, delight to the dancing
peacocks that throng the mountains and hills, thrill to the beholders by
possessing the beautiful lightings in you. (With these qualities that can also
be ascribed to Lord Shiva) You are blessed – and I seek you with the mind of a
Chataka Bird (It is said that the Chataka bird drinks water only from the
falling rain drops and gains its sustenance and will not touch the water once
it has touched the round).
Sloka – 53:
ఆకాశేన
శిఖీసమస్తఫణినాం నేత్రా కలాపి నతా-
ऽగ్రాహీప్రణవోపదేశనినదైః
కేకీతి యో గీయతే |
శ్యామాం
శైలసముద్భవాం ఘనరుచిం దృష్ట్వా నటంతం ముదా
వేదాంతోపవనే
విహారరసికం తం నీలకంఠం భజే ||
ఈ
శ్లోకమునందు ఆచార్యులు నెమలికీ స్వామికి సామ్యమును ఆపాదించుచున్నారు.
అకాశముతో
సమానమైన పింఛము కలిగినది. అన్ని సర్పములకూ ప్రభువైన వాసుకితో సల్లాపములు చేయునది,
తనకు తగ్గి ఉండెడి సర్పములను ఉపేక్షించునది, నల్లని మేఘమును పర్వతాగ్రములయందు చూచి
ప్రణవనాదమును పోలిన కేకీనాదము (షడ్జమము నెమలి అరుపును అనుకరించి ఉంటుందని
సంగీతవేత్తల అభిప్రాయము) తో గానము చేయునది, దానికి అనుగుణమైన నాట్యము చేయునది అయిన
నెమలి ఛందమున అకాశముతో సమానమైన జటాజూటము కలిగినవాడు, సమస్త సర్పములకూ అధినేత అయిన
వాసుకిని కంఠాభరణముగా ధరించువాడు, తన భక్తుల పట్ల సదా శాంత స్వరూపుడు, ప్రణవస్వరూపుడగుచూ
కేకాధ్వనులను నిరంతరమూ మునులకు, సద్విజులకు ఉపదేశము గావించువాడు, మహోన్నతమైనవాడు, నల్లని
మేని ఛాయగల్గి, పర్వతరాజపుత్రికయైన పార్వతీ దేవిని గాంచి తనతో నిత్యమూ ఆనంద
తాండవము చేయువాడు, వేదాంతములు, తదుపవనములగు పురాణములు అను వనములయందు నిత్యమూ
విహరించువాడు అగు ఆ నీలకంఠున్ని,
మహాదేవున్ని భజించుచున్నాను.
आकाशेन शिखीसमस्तफणिनां नेत्रा कलापि नता –
ऽग्राहीप्रणवोपदेशनिनदैः केकीति यो गीयते |
श्यामां शैलसमुद्भवां घनरुचिं दृष्ट्वा नटन्तं मुदा
वेदान्तोपवने विहाररसिकं तं नीलकण्ठं भजे ||
Sri Adishankara is
ascribing the qualities of a peacock to Lord Shiva in this Sloka.
I pray to Lord Shiva who
has the similar qualities of a peacock, the peacock has a plumage that towers
to the sky in a similar fashion as Lord Shiva has his locks of matted hair
stretching beyond the universe. As a peacock is always indulgent in speaking
with the lord of all snakes, Vasuki and spares the snakes that run away from
the sight of it, Lord Shiva has the Vasuki as his necklace and is always
protective of his devotees who are in prostration to him. As the peacock sings
in the swara of Shadja (one of the seven syllables of the Indian octave) like
it is as sacred for it as the primal sound of Omkara, Lord Shiva is the
personification of the Omakara itself and preaches to the saints and gods in
the same Shadja swara the knowledge of Brahman. As the peacock rich in colour
dances in happiness at the sight of dark clouds emanating from the mountains,
Lord Shiva in his purest form dances in ecstasy with Goddess Parvati Devi who
has a dark complexion and is the daughter of the king of mountains. As the
peacock is fond of forests, Lord Shiva is fond of staying in the forest of
Vedas and Puranas. I pray to such a God who can be likened to a peacock in such
qualities.
Sloka-54:
సంధ్యాఘర్మదినాత్యయో హరికరాఘాతప్రభుతానక
ధ్వానో వారిదగర్జితం దివిషదాం దృష్టిచ్ఛటాచంచలామ్ |
భక్తానాం పరితోషబాష్పవితతిర్వృష్టిర్మయూరీ శివా
యస్మిన్నుజ్జ్వలతాండవం విజయతే తం నీలకంఠం భజే ||
గ్రీష్మర్తు ముగిసిన తరువాత వర్షర్తున దినమున సంధ్యాకాలమందు సాక్షాఛ్ఛ్రీమన్నారాయనుడే వాయిద్యమును మ్రోగించుచున్నడా అనునట్లు గర్జిస్తున్న మేఘసమూహముల నడుమ, ఆకాశవీధియందు దేవతాశ్రేణి దృక్కులు చంచలమైన మెరుపుతీగలవలె కన్పడగా, భక్తుల ఆనందామృతభాష్పములు వృష్టికాగా, ఆడునెమలి వంటి శ్రీ పార్వతీమాత తోడు రాగా, ఉజ్జ్వలతాండవము చేయుచున్న నీలకంధరుడగు కైలాసనాథుని సేవించెదను.
संध्याघर्मदिनात्ययो हरिकराघातप्रभूतानक
ध्वानो वारिदगर्जितं दिविषदां दृष्टिच्छटाचंचलाम् |
भक्तानां परितोषभाष्पविततिर्वृष्टिर्मयूरी शिवा
यस्मिन्नुज्ज्वलताण्डवं विजयते तं नीलकंठं भजे ||
As the autumn draws to a close and the rainy season sets in, the days end with pleasant evenings, where the thunders of the clouds sound as if they emanated from the drums beaten by Lord Vishnu himself. The horizons are filled with gods whose eagerly looks shone like that of lightnings and the tears of joy of the overwhelmed devotees appear as drizzle. I serve Lord Shiva, who is immersed in a cosmic dance as a peacock along with His Consort, Sri Parvathi Devi becoming the peahen.
Sloka - 55:
ఆద్యాయామితతేజసే శృతిపదైర్వేద్యాయ సాధ్యాయ తే
విద్యానందమయాత్మనే త్రిజగతస్సంరక్షణోద్యోగినే |
ధ్యేయాయాఖిల యోగిభిస్సురగణైర్గేయాయ మాయావినే
సమ్యక్తాండవ సంభ్రమాయ జటినే సేయం నతిశ్శంభవే ||
ఆద్యుడు, సకల చరాచరప్రాణిసంఘములకన్నా ముందునుండి ఉన్నవాడు, వేదవాక్యముల చేత తెలుసుకోదగినవాడు, ఆ శృతులచేత మాత్రమే సాధింపదగినట్టివాడు. అత్యున్నతమైన బ్రహ్మానందమును కలిగించు విద్యయే తానై ఉన్నవాడు, ముల్లోకములనూ సంరక్షించుటయే తన కర్తవ్యముగా కలిగినటువంటి వాడు, సకలయోగిమనస్సరోజములయందు నిత్యమూ ధ్యానింపబడువాడు, కిన్నర కింపురుష విద్యాధరాది సమస్త దేవతాగణముల చేత గుణగానము చేయబడువాడు, మాయాశక్తి కలిగినటువంటివాడు, పరిపక్వ నాట్యమందు ఆసక్తి కలిగినటువంటివాడు, జటాధారి, పరమాత్ముడు అయిన సాంబసదాశివునికి , శంభునికి నా నమస్కారములు.
आद्यामिततेजसे श्रुतिपदैर्वेद्याय साध्याय ते
विद्यानन्दमयात्मने त्रिजगतस्संरक्षणोद्योगिने |
ध्येयायाखिल योगिभिस्सुरगणैर्गेयाय मायाविने
सम्यक्ताण्डव संभ्रमाय जटिने सेयं नातिश्शंभवे ||
I bow to Lord Shambho, who is the primordial one, the one who has been in existence since time immemorial, who is known only by the Vedas and whose presence can be obtained only by the practice of the sacred hymns in the Vedas, who is the personification of the highest echelon of knowledge, who has the duty to protect the three worlds, who is always pondered on by the sages and is extolled by the songs sung by the Kinnara, Kimpurusha, Vidyadhara and other heavenly beings, who himself is all the Maya that surrounds the world, who is pleased by well orchestrated dances and whose hair is matted.
Sloka - 56:
Sloka - 56:
నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయనీశ్రేయసే
సత్యాయాదికుటుంబినే మునిమనః ప్రత్యక్షచిన్మూర్తయే |
మాయాసృష్టజగత్రయాయ సకలామ్నాయాంతసంచారిణే
సాయంతాండవసంభ్రమాయ జటినే సేయం నతిశ్శంభవే ||
నిత్యమైనటువంటివాడు, సత్త్వరజస్తమోగుణములు మూర్తీభవించినటువంటివాడు, త్రిపురములనూ జయించినటువంటివాడు, కాత్యాయనీదేవి అనగా పార్వతీదేవికి శ్రేయః కారకమైనటువంటివాడు, భూతభవిష్యద్వర్తమానకాలములయందు నిలిచి తానే సత్యమైనవాడు, మునిమనస్సులయందు చిదానంద భాస్వత్స్వరూపమై వెలుగువాడు, త్రిలోకములనూ తన మాయాశక్తిచేత సృష్టించినటువంటివాడు, సకలవేదధ్వనులయందు తానై వినబడువాడు, సాయంకాల తాండవమునందు అనురక్తి కలిగినట్టివాడు, జటాధారి, పరమాత్ముడు అయిన సాంబసదాశివునికి , శంభునికి నా నమస్కారములు.
नित्याय त्रिगुणात्मने पुरजिते कात्यायनीश्रेयसे
सत्यायादि कुटुम्बिने मुनिमनः प्रत्यक्ष्यचिन्मूर्तये |
मायासृष्टजगत्रयाय सकलाम्नायान्तसंचारिणे
सायं ताण्डवसंभ्रमाय जटिने सेयं नतिश्शंभवे ||
Sloka - 57
నిత్యం స్వోదరపోషణాయ సకలానుద్దిశ్య
విత్తాశయా
వ్యర్థం పర్యటనం కరోమి
భవతస్సేవాం న జానే విభో |
మజ్జన్మాంతరపుణ్యపాకబలతస్త్వం
శర్వ సర్వాంతర-
స్తిష్ఠస్యేవ హి తేన వా పశుపతే
తే రక్షాణీయోऽస్మ్యహమ్ ||
హే పశుపతే, నిత్యమూ నా ఉదరపోషణార్థమై జనులందరినీ ఆశించి వ్యర్థముగా తిరుగుతున్నాను.
నీ సేవాసత్కారములు చేయ నెఱుగనైతిని. కానీ ఏ నా పూర్వజన్మపుణ్యపరిపక్వబలముచేతనో ఆపిపీలికాంతబ్రహ్మమయమైన ఈ జగత్తుకంతటికీ
మూలము నీవు అను విషయమును
తెలుసుకొంటిని. సమస్తజంతు అన్నమయాది కోశములయందు నీవే
వసించియున్నావని తెలిసిన నేను ఇప్పుడు నీ రక్షణకు అర్హుడను కదా.
नित्यं स्वोदरपोषणाय सकलानुद्दिश्य वित्ताशया
व्यर्थं पर्यटनं करोमि भवतस्सेवां न जाने विभो |
मज्जन्मान्तरपुण्यपाकबलतस्त्वं शर्व सर्वान्तर-
स्तिष्ठस्येव हि तेन वा पशुपते ते रक्षणीयोऽस्म्यहम् ||
Hey Pashupathi, My Lord, I was wandering
purposelessly for the sake of my sustenance begging around for wealth and did
not pay attention to you. However, as my fate turns from the strength of my
virtuous deeds in the past lives, I became aware of the fact that you are the
inherent power in all the beings and the seed to all creation. I beseech you my
lord, with this knowledge, I am now worthy of your protection.
Sloka - 58:
ఏకోవారిజబాంధవః
క్షితినభోవ్యాప్తం తమో మండలం
భిత్వా లోచనగోచరోపి భవతి త్వం
కోటి సూర్యప్రభః |
వేద్యః కిన్నభవస్యహో ఘనతరం
కీదృగ్భవేన్మత్తమ
స్తత్సర్వం వ్యపనీయ మే పశుపతే
సాక్షాత్ప్రసన్నోభవ ||
ప్రభో పశుపతే! కమలభాందవుడని
పేరుగల్గిన ఆ సూర్యభగవానుడు, ఒక్కడే అయిననూ, ఆకాశభూమండలములకు
క్రమ్మిన చీకట్లను పారద్రోలి మా కంటికి కనపడువాడు అగుచున్నాడు. నీవు
కోటిసూర్యద్యుతులచే ప్రకాశించువాడివి అని లోక ప్రతీతి అయినను నాకు నీ దర్శనభాగ్యము
కలగకుండిన నా పాపమను పెంజీకటి ఎంత గొప్పదో కదా? ప్రభో, దానిని సర్వమునూ తొలగించి నాకు నీవు ప్రసన్నుడవు కమ్ము దేవా.
एको वारिजबान्धवः क्षितिनभोव्याप्तं तमो मण्डलं
भित्वा लोचनगोचरोपि भवति त्वं कोटि सूर्यप्रभः |
वेद्यः किन्नभवस्यहो घनतरं कीदृग्भवेन्मत्तम
स्तत्सर्वं व्यपनीय मे पशुपते साक्षात्प्रसन्नो भव ||
Hey Pashupathi, the Lord of the Sun
famed as the friend of lotuses (It is said that the lotuses bloom at the break
of the dawn and hence Sun is called the friend of lotuses) dispels all the
darkness from the skies and on earth as he rises on the horizon and is still
visible to our naked eyes. It is said that you are of the luminescence of 10
million Suns and capable of destroying all the sins. If you are not visible to
my sight, I can only imagine how dark could my sins be. You are the only one
who can eliminate all my offenses. I pray to you to be visible to me My Lord by
doing so.
Sloka - 59:
హంసః పద్మవనం సమిచ్ఛతి యథా
నీలాంబుదం చాతకః
కోకః కోకనదప్రియం ప్రతిదినం
చంద్రం చకోరస్తథా |
చేతో వాంఛతి మామకం పశుపతే
చిన్మార్గమృగ్యం విభో
గౌరీనాథ భవత్పదాబ్జయుగళం కైవల్యసౌఖ్యప్రదమ్ ||
కలహంసలు పద్మములతో కూడిన సరోవరమును కోరినటుల, చాతకపక్షి మేఘమును ఆపేక్షించినయటుల, చక్రవాకములు సూర్యుని పొందగోరినట్టు, చకోరములు చంద్రకాంతిని కాంక్షించిన రీతి, నా మనస్సు కైవల్యసుఖప్రదాయకములు, వేదాన్తోపనిషద్సూచికలు అయిన నీ పదసరోజద్వంద్వమును చేరగోరుతున్నవి ప్రభో పశుపతే, గౌరీనాథా. నన్ను కరుణింపుము.
గౌరీనాథ భవత్పదాబ్జయుగళం కైవల్యసౌఖ్యప్రదమ్ ||
కలహంసలు పద్మములతో కూడిన సరోవరమును కోరినటుల, చాతకపక్షి మేఘమును ఆపేక్షించినయటుల, చక్రవాకములు సూర్యుని పొందగోరినట్టు, చకోరములు చంద్రకాంతిని కాంక్షించిన రీతి, నా మనస్సు కైవల్యసుఖప్రదాయకములు, వేదాన్తోపనిషద్సూచికలు అయిన నీ పదసరోజద్వంద్వమును చేరగోరుతున్నవి ప్రభో పశుపతే, గౌరీనాథా. నన్ను కరుణింపుము.
हंसः पद्मवनं समिच्छति यथा नीलांबुदं चातकः
कोकः कोकनदप्रियं प्रतिदिनं चन्द्रं चकोरस्तथा |
चेतो वाञ्छति मामकं पशुपते चिन्मार्गमृग्यं विभो
गौरीनाथ भवत्पादाब्जयुगळं कैवल्य सौख्यप्रदम् ||
As the swans like a pond of lotuses and
as a chataka bird (It is said in Hindu scriptures, that the chataka
birds sustain on the rain from the clouds and will not touch the water once
it touches the ground) desires a dark cloud ready to rain, as
the Chakravaka bird (Ruddy goose) is pleased by the sun and a
Chakora bird (A Chakora bird is fabled to live on the shining of
the moon) awaits a full moon, my heart longs for a vision of the
duo of your feet, O Pashupathi. Hey Gourinatha, Those feet are the ones that can
endow eternal bliss to anyone who beseeches them and are sought
by the Vedas and Upanishads as well.
Sloka - 60:
రోధస్తోయహృతః
శ్రమేణపథికశ్ఛాయాం తరోర్వృష్టితః
భీతః స్వస్థగృహం గృహస్థమతిథిః
దీనః ప్రభుం ధార్మికమ్ |
దీపం సంతమసాకులశ్చ శిఖినం శీతావృతస్త్వం తథా
చేతస్సర్వభయాపహం వ్రజ సుఖం
శంభోః పదాంభోరుహమ్ ||
ఓ మానసమా! ఏ విధముగా నీటియందు
కొట్టుకొనిపోవుచున్నవాడు తీరమును ఆశ్రయించునో, మార్గాయాసముచే డస్సినవాడు ఒక తరువు నీడయందు సేద తీరునో,
వర్షము చేత తడిసి భయపడినవాడు సుఖముగానుండనోపు గృహమును చేరునో,
అతిథిమర్యాదలు తెలిసిన గృహస్థును అతిథి అభ్యాగతులు ఆశ్రయించెదరో,
దీనుడైనవాడు ధర్మప్రభువును శరణు కోరునో, అంధకారములోనున్న
వ్యక్తి దీపమున్న చోటును చేరునో, చలిబాధచేత పీడితుడైనవాడు
అగ్నిహోత్రమును కోరునో ఆ విధముగా నీవు సకల భయాపహారము, నిత్యసుఖదాయకము
అయిన శంకరుని పాదపద్మములను ఆశ్రయించుము.
रोधस्तोयहृतः श्रमेणपथिकश्छायां तरोर्वृष्टितः
भीतः स्वस्थगृहं गृहस्थमतिथिः दीनः प्रभुं धार्मिकम् |
दीपं सन्तमसाकुलश्च शिखिनं
शीतावृतस्तवं तथा
चेतस्सर्वभयापहं व्रज सुखं शंभोः पदाम्भोरुहम् ||
O heart!
As the one dragged by the force of water ascends to a shore, as a fatigued
wayfarer seeks shade of a tree, as a person drenched in the rain beseeches a
house for warmth, as a guest approaches the threshold of a host, as an indigent
man pursues the patronage of a noble king, a person in darkness goes after a
light, as the one shrouded in cold searches for fire, so, you seek the lotus
feet of the Lord Shambhu (God Shankara) who is the one that can extricate you
from all the fears and provide you with all the non-mundane comforts.
Sloka
– 61:
అంకోలం నిజబీజసంతతిరయస్కాన్తోపలం
సూచికా
సాధ్వీనైజవిభుం
లతాక్షితిరుహం సింధుస్సరిద్వల్లభం |
ప్రాప్నోతీహ
యథాతథా పశుపతేః పాదారవిందద్వయం
చేతోవృత్తిరుపేత్య
తిష్ఠతి సదా సా భక్తిరుచ్యతే ||
ఊడుగ
చెట్టు విత్తనములు ఏ విధముగా తమను కాచిన చెట్టును చేరునో, సూదులు ఏ విధముగా సూదంటు
రాయికి ఆకర్షింపబడుతవో, పతివ్రతయగు స్త్రీ తన భర్తను ఏ విధముగా విడనాడి పోక
యుండునో, తీగలు వృక్షమును ఏ పగిది ఆశ్రయించుకొనియుండునో, సముద్రుని ఏ చందమున నదులు
చేరునో, ఆ విధముగా మనసు సదా నీ పాదపద్మములయందు నిమగ్నమయ్యున్న దానిని భక్తి అందురు
ప్రభో పశుపతే!
अङ्कोलं निजबीजसंततिरायस्कान्तोपलं सूचिका
साध्वीनैजविभुं लताक्षितिरुहं सिन्धुस्सरिद्वल्लभं |
प्राप्नोतीह यथातथा पशुपतेः पादारविन्दद्वयं
चेतोवृत्तिरुपेत्य तिष्ठति सदा सा भक्तिरित्युच्यते ||
My
Lord, Pasupati, as the seeds of an avocado fruit reach the stem of the tree, as
a bunch of needles are attracted by a magnet, as a chaste wife does not leave
her husband, as a creeper holds on to a tree that supports it, as all the
rivers tend to merge in the ocean, so is the heart of a devotee always bent on
your lotus feet, which is called the true Bhakti.
Sloka
– 62:
ఆనందాశ్రుభిరాతనోతి
పులకం నైర్మల్యతశ్చాదనం
వాచా శంఖముఖేస్థితైశ్చ
జఠరాపూర్తిం చరిత్రామృతైః |
రుద్రాక్షైర్భసితేన
దేవ వపుషో రక్షాం భవద్భావనా
పర్యంకే వినివేశ్య
భక్తిజననీ భక్తార్భకం రక్షతి ||
ఓ
మహాదేవా! నీ భక్తియను తల్లి తన బిడ్డలను (భక్తులను),
ఆనందామృతములతో జలకములాడించి, కాలుష్యహీనమైన నైర్మల్యము అనే బట్టలు తొడిగి, నీ
చరితములనెడి అమృతధారలను వాక్కు అనెడి క్రోవిచెంబుతో నోరారా, కడుపునిండుగా సేవింపజేసి,
రుద్రాక్షలతో రక్షకట్టి నీ ఆలోచనలు అను సుఖపానుపు మీద పవళింపజేసి రక్షించుకొనును.
आनन्दाश्रुतिरातनोति पुलकं निर्माल्यतश्चादनं
वाचा शङ्खमुखेस्थितैश्च जठरापूर्तिं चरित्रामृतैः |
रुद्राक्षैर्भसितेन देव वपुषो रक्षां भवद्भावना
पर्यङ्के विनिवेश्य भक्तिजननी भक्तार्भकं रक्षति ||
Hey Mahadeva,
the mother of devotion bathes her children (devotees) with the ambrosia of
happiness, clads them in the clothes of purity, feeds them the nectar of your
stories through the conchs of talk, protects them with the amulets of Rudraksha
and puts them to sleep on the beds of your thoughts.
No comments:
Post a Comment